Double hat-trick : క్రికెట్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు.. ఆరు బంతుల‌కు 6 వికెట్లు.. అదీ ఒకే ఓవ‌ర్‌లో.. 12 ఏళ్ల కుర్రాడి ఘ‌న‌త‌

ఒక బౌల‌ర్ హ్యాట్రిక్ వికెట్లు తీయ‌డ‌మే గ‌గ‌నం అంటుంటే డ‌బుల్ హ్యాట్రిక్ తీయ‌డ‌మా అదీ కూడా వ‌రుస బంతుల్లోనా అని అంటారా. దిగ్గ‌జ బౌల‌ర్లు సైతం క‌ల‌లో కూడా ఊహించ‌ని ఈ అరుదైన రికార్డును ఓ 12 ఏళ్ల కుర్రాడు సాధించాడు.

Oliver Whitehouse

Double hat-trick wickets : సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లో ఓవ‌ర్‌కు ఆరు బంతులు ఉంటాయన సంగ‌తి తెలిసిందే. వైడ్లు, నోబాల్స్ వేస్తే ఆ సంఖ్య ఆ ఓవ‌ర్‌లో పెరుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 6 బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు లేదంటే 6 ఫోర్లు కొట్టిన బ్యాట‌ర్లను చూశాం. అయితే.. ఓ బౌల‌ర్ ఆరు బంతుల‌కు ఆరు వికెట్లు తీయ‌డాన్ని చూడ‌లేదు. ఒక బౌల‌ర్ హ్యాట్రిక్ వికెట్లు తీయ‌డ‌మే గ‌గ‌నం అంటుంటే డ‌బుల్ హ్యాట్రిక్ తీయ‌డ‌మా అదీ కూడా వ‌రుస బంతుల్లోనా అని అంటారా. దిగ్గ‌జ బౌల‌ర్లు సైతం క‌ల‌లో కూడా ఊహించ‌ని ఈ అరుదైన రికార్డును ఓ 12 ఏళ్ల కుర్రాడు సాధించాడు.

Shane Warne : షేన్ వార్న్ బ‌యోపిక్‌.. రొమాంటిక్ స‌న్నివేశం చేస్తూ యాక్ట‌ర్స్ ఆస్ప‌త్రి పాలు..

అవును ఇది నిజం. ఇంగ్లాండ్ కు చెందిన ఓ జూనియ‌ర్ క్రికెటర్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఒలివర్ వైట్‌హౌజ్(Oliver Whitehouse,) అనే 12 ఏళ్ల కుర్రాడు ఒక ఓవ‌ర్‌లో ఆరు బంతుల‌కు ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే అంద‌రిని క్లీన్ బౌల్డ్ చేయ‌డం. బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ త‌రుపున ఒలివ‌ర్ ఆడుతున్నాడు. కుక్‌హిల్‌తో జరిగిన మ్యాచ్‌లో అత‌డు విజృంభించాడు. 2 ఓవ‌ర్లు వేసిన ఒలివర్ రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 8 వికెట్లు తీశాడు. మొద‌టి ఓవ‌ర్‌లో అత‌డు ఆరు బంతుల‌కు ఆరు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా రెండో ఓవ‌ర్‌లో రెండు వికెట్లు సాధించాడు.

Coin toss : కొత్త రూల్‌.. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ జ‌రుగ‌కపోతే.. కాయిన్ టాస్ విజేత‌.. ఇదేం దిక్కుమాలిన నిబంధ‌న అంటున్న ఫ్యాన్స్‌

బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు కూడా ఆరు బంతుల‌కు ఆరు వికెట్లు తీయ‌లేదు. కాగా.. ఒలివ‌ర్ అమ్మ‌మ్మ యాన్ జోన్స్ 1969లో వింబుల్డ‌న్ టెన్నిస్ ఛాంపియ‌న్ కావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు