Domestic Violence India : భారత్‌లో కరోనా రెండో‌ వేవ్‌లో 3,582 గృహహింస కేసులు..!

ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కరోనానే వెంటాడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు.

Domestic Violence India : ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కరోనానే వెంటాడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఆర్థికపరంగానే కాకుండా కుటుంబ సమస్యలతోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు సరైన ఉపాధి దొరక్క ఇంటికే పరిమితం కాగా… మరికొన్ని రంగాల్లో ఇంట్లో నుంచే పనిచేస్తూ జీవితాన్ని గడిపేశారు.

ఉపాధి లేక చేతుల్లో చిల్లిగవ్వలు లేక కుటుంబ పోషణ భారమైన పరిస్థితులెన్నో వెలుగుచూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైన భారంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2021లో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనూ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇదే సమయంలో దేశంలో గృహ హింస కేసులు అధికంగా నమోదయ్యాయని రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు.

2021 ఏడాదిలో ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల మధ్యలో 3,582 గృహ హింస కేసులు నమోదైనట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గృహ హింస కేసుల‌పై రాజ్యసభలోని స‌భ్యులు ఒకరు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాతపూర్వక సమాధానమిచ్చారు.

క‌రోనా సెకండ్ వేవ్‌లో 3,582 గృహ హింస కేసులు న‌మోదు అయ్యాయని, 2020 ఏడాదిలో 3,748 గృహ హింస కేసులు న‌మోదైన‌ట్లు వివరణ ఇచ్చారు. నేష‌న‌ల్ లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీ ప్ర‌కారం.. 2020తో పోల్చితే ఈ ఏడాది గృహ హింస కేసులు తగ్గినట్టు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

Read Also : Jio Prepaid Recharge : వాట్సాప్‌‌‌ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే..?

ట్రెండింగ్ వార్తలు