Adipurush: నెల రోజుల ముందే ట్రైలర్.. ఆదిపురుష్ రిస్క్ చేస్తున్నాడా..?

మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ట్రైలర్ ను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్‌లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను జూన్ 16న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Adipurush: హాలీవుడ్ మూవీతో పాటు వస్తున్న ‘ఆదిపురుష్’ ట్రైలర్..?

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఆ రోజున ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని చూస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ను అత్యద్భుతంగా కట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Adipurush: ఆదిపురుష్ నుండి కొత్త పోస్టర్.. సీతగా ఆకట్టుకుంటున్న కృతి సనన్!

ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తే, ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్‌లు ఇవ్వగా, లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ ట్రైలర్‌ను సినిమా రిలీజ్‌కు నెల రోజుల ముందే రిలీజ్ చేస్తే ఈ సినిమాపై అది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి నిజంగానే ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు