Alia Bhatt : పెళ్లి చేసుకోవడం, తల్లి కావడం నా ఇష్టం.. అలియాభట్ వ్యాఖ్యలు..

తాజాగా మరోసారి అలియా ఇలాంటి వ్యాఖ్యలకి ఘాటుగా స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ నా మనసు చెప్పేదే వింటాను. జీవితం మనం అనుకున్నట్టు ప్లాన్ చేయలేము. దానంతట అదే జరిగిపోతుంది. నా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే నేను పెళ్లి..............

Alia Bhatt :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేస్తూ రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే రణబీర్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఓ పాపకి కూడా జన్మనిచ్చింది. పెళ్లైన వెంటనే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసి పాపకి జన్మనిచ్చింది. అయితే హీరోయిన్ అయి ఉండి 29 ఏళ్లకే పెళ్లి చేసుకోవడమే కాక, పాపని కూడా కనడంతో తన కెరీర్ అయిపొయింది ఇంక అని కామెంట్స్ చేస్తున్నారు పలువురు. అసలు అప్పుడే పిల్లలు ఎందుకు కన్నావు అని అలియాతో కూడా పలువురు అన్నారట.

ఇప్పటికే పలు సార్లు అలియా వీటి గురించి స్పందించింది. తాజాగా మరోసారి అలియా ఇలాంటి వ్యాఖ్యలకి ఘాటుగా స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ నా మనసు చెప్పేదే వింటాను. జీవితం మనం అనుకున్నట్టు ప్లాన్ చేయలేము. దానంతట అదే జరిగిపోతుంది. నా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకున్నాను, తల్లి అయ్యాను నిజమే. కానీ పెళ్లి చేసుకున్నంత మాత్రాన, తల్లి అయినంత మాత్రాన చేసే వృత్తిలో మార్పులు వస్తాయా? ఓ నటిగా నాకు నా కెరీర్ మీద నమ్మకం ఉంది. అయినా నేను ఇలాంటి వాటి గురించి పెద్దగా ఆలోచించను. ఆఫర్స్ వస్తే చేస్తాను లేకపోతే లేదు. నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. ఇష్టపడే పాపని కన్నాను. పెళ్లి, పిల్లలు నా ఇష్టం. నేను తీసుకున్నవి కరెక్ట్ నిర్ణయాలే అని తెలిపింది.

#PVT04 : భయంకరమైన ప్రయాణం అంటూ.. సమ్మర్ బరిలో పంజా వైష్ణవ్ తేజ్..

ఇక పాప పుట్టిన తర్వాత కూడా ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి వెంటనే మళ్ళీ జిమ్ కి వెళ్లడం, బాడీ మీద ఫోకస్ పెట్టడం చేస్తుంది. జిమ్ కి వెళ్తూ ఆ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలోనే మళ్ళీ గ్రాండ్ గా సినిమాల్లోకి కంబ్యాక్ ఇవ్వనున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు