Bandi Sanjay On Tickets : పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఎన్నికల్లో టికెట్లు-బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని తేల్చి చెప్పారు. వ్యక్తుల కోసం పని చేసేవారికి టికెట్లు రావు అన్నారు.(Bandi Sanjay On Tickets)

Bandi Sanjay On Tickets : పాదయాత్ర ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని బండి సంజయ్ తేల్చి చెప్పారు. వ్యక్తుల కోసం పని చేసేవారికి టికెట్లు రావు అన్నారు. టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు నాయకులను తిప్పుకుంటున్నారని.. తిప్పుకున్న వారికీ.. తిరిగిన వారికీ ఇద్దరకీ టికెట్లు రావని బండి సంజయ్ తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ కూడా ఇదే విషయం స్పష్టం చేశారని బండి సంజయ్ వెల్లడించారు.

పార్టీలో కొందరు వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరని అన్నారు. పార్టీ అధ్యక్షుడైప్పటికీ.. ఎన్నికల్లో తన టికెట్ పై కూడా స్పష్టత లేదన్నారాయన. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్న వారికే టికెట్ రాలేదని బండి సంజయ్ అన్నారు.(Bandi Sanjay On Tickets)

కాగా, ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్. ఈ క్రమంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర పదాధికారులతో సమావేశమైన బండి సంజయ్ యాత్ర గురించి వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

Bandi Sanjay Kumar: రైతుల ముసుగులో దాడులు చేయించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

తెలంగాణలో గురువారం నుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. రైతుల ముసుగులో మాపై దాడులు చేయించి, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ నేతలు స్కెచ్ వేశారని సంజయ్ ఆరోపించారు.

తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడినైనా భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్. రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసినా.. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టేందుకు సీఎం కేసీఆర్ పన్నాగం పన్నారని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ అరాచకాలు, అవినీతి-నియంత-కుటంబ పాలనను ప్రజల్లో ఎండగడతామని బండి సంజయ్ అన్నారు. రైతుల కోసం అంటూ ఢిల్లీలో దీక్షకు దిగిన కేసీఆర్.. గంటసేపు కూడా దీక్ష చేయలేకపోయారని.. అలాంటి వ్యక్తి దేశంలో ప్రకంపనలు సృష్టిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Singireddy Nirajan reddy : చెమటోడ్చి కష్టపడడమే కాదు.. కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఏప్రిల్ 14 నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు