Brahmanandam : మీమ్స్ చేసే వాళ్లందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా : బ్రహ్మానందం

రోజూ సోషల్ మీడియాలో బోల్డన్ని మీమ్స్ చూస్తూ ఉంటాం. అందులో ఎక్కువగా బ్రహ్మానందం ఫేస్ తోటే ఉంటాయి. బ్రహ్మానందం లేకపోతే మీమ్స్ లేవు. ఇది మీమర్స్ కూడా ఒప్పుకుంటారు. బ్రహ్మానందం కూడా...

Brahmanandam :  మనందరం నవ్వడం కోసమే బ్రహ్మ ఆనందంలో ఉన్నప్పుడు ఓ మనిషిని పుట్టిస్తే అతనే బ్రహ్మానందం అయ్యాడేమో. తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యం, తెలుగు సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం బ్రహ్మానందం మనతో ఉండటం. తెరపైన కామెడీ కావాలంటే, జనాలు నవ్వాలంటే ఆయనొక్కడు కనపడితే చాలు పేజీల పేజీల స్క్రిప్టులు అక్కర్లేదు, ఆయన ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు అని ప్రూవ్ చేశారు. 40 ఏళ్లకు పైగా మన అందర్నీ నవ్విస్తూనే ఉన్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్‌లో సింహాసనం.. రసవత్తరంగా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్

సినిమాకి వెళ్తే ఆ సినిమాలో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాలి అనుకుంటాం. కానీ ఇటీవల సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. గతంలో ఓ టీవీ ఛానల్ లో వచ్చిన కామెడీ షోకి ఆయన జడ్జిగా వ్యవహరించారు. తాజాగా మరోసారి బ్రహ్మానందం బుల్లితెరపై మెరవనున్నారు. ‘ఆలీతో సరదాగా’ అనే ప్రోగ్రాంలో ఆలీ యాంకర్ గా ఎంతో మంది గెస్ట్ లని తీసుకొచ్చారు. ఎంతో మంది సెలబ్రిటీల ఇంటర్వ్యూలు అద్భుతంగా సాగాయి ఈ షోలో. ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో తాజాగా బ్రహ్మానందం గెస్ట్ గా వచ్చారు. అలీ, బ్రహ్మానందం ఇంటర్వ్యూ నుంచి ప్రోమో రిలీజ్ చేశారు. ఆద్యంతం ఈ ప్రోమో నవ్వులతోనే సాగింది. ఇందులో ఆలీ చాలా ప్రశ్నలు అడిగారు. వాటికి ఆయన స్టైల్ లో సమాధానం చెప్పారు బ్రహ్మానందం.

Naatu Naatu : రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పుకి ఇన్ని టేక్స్ తీసుకున్నారా??

అయితే మనం రోజూ సోషల్ మీడియాలో బోల్డన్ని మీమ్స్ చూస్తూ ఉంటాం. అందులో ఎక్కువగా బ్రహ్మానందం ఫేస్ తోటే ఉంటాయి. బ్రహ్మానందం లేకపోతే మీమ్స్ లేవు. ఇది మీమర్స్ కూడా ఒప్పుకుంటారు. బ్రహ్మానందం కూడా తన ఫొటోలతో ఉన్న మీమ్స్ చూసి సరదాగా ఫీల్ అవుతారు. గతంలో కూడా మీమ్స్ చేసే వాళ్లకి థ్యాంక్స్ చెప్పారు. తాజాగా ఈ షోలో కూడా ఆలీ మీమ్స్ గురించి అడగ్గా.. ”మీమ్స్‌ క్రియేట్‌ చేసే వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల ఇటీవల నేను సినిమాల్లో నటించలేకపోయినా, జనాలు నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లే. నేను వాళ్ళకి రుణపడి ఉంటాను కానీ వాళ్ళ మీద అరవను” అని చెప్పారు బ్రహ్మానందం.

Chay Sam : మొత్తానికి సమంత నాగ చైతన్యకి బర్త్‌డే విషెష్ చెప్పలేదుగా…

ఇప్పుడు ఈ మాటలు కూడా మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీమర్స్ అంతా బ్రహ్మానందం చెప్పిన ఈ మాటలని పోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్క కమెడియన్ ఉంటేనే మనం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాము. అలాంటిది ఇద్దరు లెజెండరీ కమెడియన్స్ ఒకేసారి బుల్లితెరపైన కనిపిస్తే టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు