Uttar Pradesh: ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి క్యాన్సిల్.. ఆ తరువాత అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పలేకపోయాడని పెళ్లి జరిగిన మరుసటిరోజు వధువు వరుడిని వదిలేసింది.

marriage cancle

Uttar Pradesh: పెళ్లి కొడుకు నచ్చలేదనో.. మర్యాదలు సరిగా లేవనో.. ప్రేమించిన వ్యక్తి వచ్చాడనో.. ఇలా పెళ్లిళ్లు ఆగిపోవటం, పెళ్లి తరువాత వధువు వెళ్లిపోవటం మనం చూస్తుంటాం. కానీ ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లాలో విచిత్రమైన కారణంతో పెళ్లి కూతురు ఈ పెళ్లికొడుకు నాకొద్దని చెప్పేసింది. పెళ్లి తంతు పూర్తయిన మరుసటి రోజు ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్న కారణంతో ఈ వరుడు నాకొద్దంటూ వధువు చెప్పేసింది. ఆ తరువాత అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Kerala : కాసేపట్లో పెళ్లి.. వధువుని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.. సినిమాని తలపించిన క్లైమాక్స్

శివశంకర్ అనే వ్యక్తికి రంజన అనే యువతితో ఈనెల 11న వివాహం నిశ్చయమైంది. ఆరు నెలల క్రితమే ఈ వివాహాన్ని పెద్దలు కుదిర్చారు. పెళ్లితంతు ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన మరుసటిరోజు ఇరు కుటుంబీకులు వరుడు ఇంట్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్లంతా హడావుడిగా ఉంది. కొంతమంది బంధువులు ఒకేచోట కూర్చున్నారు. నూతన దంపతులు కూడా వీరితో చేరిపోయారు. ఈ సమయంలో వధువు సోదరి భావను ఆటపట్టిస్తూ మన దేశ ప్రధాని ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించింది.

Thiruvananthapuram : నీటి అడుగున యోగా .. అబ్బురపరుస్తున్న ఇండియన్ ఆర్మీ ప్రదర్శన

శివశంకర్‌కు ప్రధాని పేరు తెలియక ఇబ్బంది పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న బంధువులు అతన్ని గేలిచేస్తూ నవ్వారు. దీంతో భార్య రంజనకు కోపం వచ్చింది. దేశ ప్రధాని పేరుకూడా తెలియని నీతో నేను కాపురం చేయలేనని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ వధువు నచ్చజెప్పే సమయంలో అందరికీ దిమ్మతిరిగే షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

అక్కడే ఉన్న శివశంకర్ తమ్ముడు అనంత్‌ను పెళ్లి చేసుకుంది. అక్కడే తాళిబొట్టు కట్టించుకుంది. రజన చేసిన పనికి అందరికి దిమ్మతిరిగిపోయింది. కొందరు వారించే ప్రయత్నం చేసినా రంజన వినిపించుకోలేదు. అయితే, అనంత్ కంటే రంజన వయసు ఎక్కువ. ఈ ఊహించని ఘటనతో అనంత్‌ నోట మాటలు రాలేదు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు