Kerala : కాసేపట్లో పెళ్లి.. వధువుని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.. సినిమాని తలపించిన క్లైమాక్స్

కాసేపట్లో పెళ్లి.. ఆపండి అంటూ పోలీసులు.. ఇదేదో సినిమాలో సీన్ లాగ అనిపిస్తోంది కదూ. కేరళలో ఇలాంటి సీన్ జరిగింది. పెళ్లికూతురిని పోలీసులు కళ్యాణ మండపం నుంచి లాక్కెళ్లారు. ఆ తరువాత ఏం జరిగింది?

Kerala

Kerala : కొన్ని నిముషాల్లో వరుడు వధువు మెడలో తాళి కట్టాలి. అంతలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చాలా సినిమాల్లో క్లైమాక్స్‌లో కనిపించే సీన్ లాగ వధువుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయారు. మతాంతర వివాహం చేసుకోవాలనుకున్న ఆ ప్రేమ జంటకు ఫైనల్ గా పెళ్లైందా?

Uttar Pradesh : తాళి కట్టే సమయంలో అదనపు కట్నం డిమాండ్.. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబీకులు

కేరళలోని కోవలం దేవాలయంలో ఓ జంట మతాంతర వివాహం చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కొద్దిసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టాలి. అంతలో ట్విస్ట్ ఇస్తూ పోలీసులు అరంగేట్రం చేసారు. వధువును వరుడి నుంచి వేరు చేసి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. తాను రానని ఆమె అరుస్తున్నా పోలీసులు ఓ ప్రైవేటు వాహనంలోకి ఆమెను బలవంతంగా నెడుతూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

 

వధువును మెజిస్టీరియల్ కోర్టుకు తరలించారు. వరుడు తనకు సంవత్సరం నుంచి తెలుసునని.. అతనిని తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుంటున్నానని ఆమె కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో కోర్టుకి చేరుకున్న వరుడితో ఆమె వెళ్లేందుకు అనుమతిచ్చారు. అలా వారి ప్రేమ కథ పెళ్లి పీటలు ఎక్కింది.

Rajasthan : ఇదేం ప్రేమరా బాబు .. వధువును కిడ్నాప్ చేసి ఎడారిలో ’ఏడు అడుగులు’..

కాయంకుళం పోలీస్ స్టేషన్‌లో యువతి మిస్సింగ్ అని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కోర్టులో హాజరు పరచినట్లు అలప్పుజా జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఆమె వరుడిని తన ఇష్టంతో వివాహం చేసుకునేందుకు వెళ్లానని చెప్పడంతో ఈ కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు