Manipur : మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై కేంద్రం సీరియస్ .. ట్విట్టర్‌పై చర్యలు తీసుకునే అవకాశం

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను పురుషుల గుంపు నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్విట్టర్‌పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Manipur : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను పురుషుల గుంపు నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియో సంచలనం రేపింది. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్విట్టర్‌పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మరింత ప్రచారం కాకుండా ఐటీ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Manipur Violence: మణిపూర్ విషయంలో కలుగజేసుకుంటామన్న అమెరికా.. మీ వ్యవహారాల్లో వేలు పెట్టలేదంటూ చురకలు అంటించిన కాంగ్రెస్ నేత

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను పురుషుల గుంపు నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది. వారిని పొలం వరకు తీసుకువెళ్లి వేధించి అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనేకమంది ఆగ్రహానికి కారణమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుకీ, మైతీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. జాతి హింసలో 120 మందికి పైగా చనిపోయారు. అనేకమంది పారిపోయి సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనంగా మారింది.

Manipur women video : మణిపూర్ ఘటనపై నివేదిక ఇవ్వండి : సుప్రీం చీఫ్ చంద్రచూడ్ ఆదేశం

ఈ వీడియోకి సంబంధించి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌కు ఒక నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని చెబుతున్నారు. భయంకరమైన దాడి, గ్యాంప్ రేప్‌ జరిగి ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడిన 15 రోజులకు పోలీసులు వచ్చారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ సంఘటనను లేవనెత్తాలని భావిస్తున్నాయి. మరోవైపు మణిపూర్‌పై చర్చకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు