Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఆ డైరెక్టర్ నుంచి తీసుకున్న చిరంజీవి.. చిరు అడిగితే ఆ డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా?

ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించి మాత్రమే కాకుండా అనేక విషయాలని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమా గురించి కూడా మాట్లాడారు.

Chiranjeevi God Father Movie Title taken from Rachha movie director Sampath Nandi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi), త‌మ‌న్నా(Tamannaah) జంట‌గా మెహర్ రమేష్(Meher Ramesh) ద‌ర్శ‌క‌త్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన సినిమా భోళా శంక‌ర్‌(Bhola Shankar ). కీర్తి సురేష్(Keerthy Suresh) ఇందులో చిరంజీవి చెల్లి పాత్ర పోషిస్తుండగా సుశాంత్‌ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడు. ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది భోళా శంకర్.

తాజాగా భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించి మాత్రమే కాకుండా అనేక విషయాలని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమా గురించి కూడా మాట్లాడారు. మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగులో గాడ్ ఫాదర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Bholaa Shankar : రీమేక్ సినిమాలు ఎందుకు చేస్తానంటే..? రీమేక్ విమర్శలపై చిరంజీవి వ్యాఖ్యలు..

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రచ్చ డైరెక్టర్ సంపత్ నంది రాగా అతని గురించి చిరంజీవి మాట్లాడుతూ.. సంపత్ నంది చరణ్ తో రచ్చ సినిమా చేసి మా ఫ్యామిలిలో ఒకడయ్యాడు. నా అభిమాని, తమ్ముడు, రచ్చ డైరెక్టర్ అని కాకుండా ఒక విషయానికి నేను అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. నేను గాడ్ ఫాదర్ సినిమా చేసే ముందు టైటిల్ రిజిస్ట్రేషన్ కి వెళ్తే ఈ టైటిల్ ఆల్రెడీ సంపత్ నంది దగ్గర ఉందని తెలిసింది. మా వాళ్ళు అడుగుతా అన్నా నేనే డైరెక్ట్ గా కాల్ చేసి సంపత్ నా నెక్స్ట్ సినిమాకి గాడ్ ఫాదర్ టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది. అది నీ దగ్గర ఉందంట, నా సినిమాకు ఇస్తావా అని అడగ్గానే అతను స్పందించి సర్ దేవుడికి ప్రసాదం పెట్టినట్టే సర్ మీకు నా టైటిల్ ఇవ్వడమంటే అని చెప్పి అడగ్గానే ఓకే అన్నాడు. ఆ విషయంలో సంపత్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు