Chiranjeevi : ఒకే ఫ్రేమ్‌లో మెగా, సూపర్, రెబల్ స్టార్స్.. అదిరిపోయిన ఫోటో..

వాళ సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లిరోజు కావడంతో చిరంజీవి మహేష్ కి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మహేష్ కి బొకే ఇస్తుండగా ఫోటో తీసుకున్నారు. ఈ ఫొటోలో......

Tollywood :  సినిమా టికెట్ ధరల విషయంలో, సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ సీఎం జగన్ తో మాట్లాడటానికి ఇవాళ చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి… తదితర ప్రముఖులు విజయవాడ వెళ్లారు. అయితే వీరంతా హైదరాబాద్ నుంచి ఒకే ఫ్లైట్ లో వెళ్లారు. ఇలా మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్ కలవడం ఒక ఎత్తు అయితే వారు పిక్ దిగి షేర్ చేయడం మరో ఎత్తు.

Allu Aravind : చిరంజీవి వెళ్లారు.. నేను వెళ్ళవసరం లేదు..

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లిరోజు కావడంతో చిరంజీవి మహేష్ కి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మహేష్ కి బొకే ఇస్తుండగా ఫోటో తీసుకున్నారు. ఈ ఫొటోలో చిరంజీవితోపాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ ఉన్నారు. ఈ ఫోటోని చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేసి..”అత్యంత ప్రియమైన మరియు ప్రియమైన జంటలలో ఒకరైన మహేష్ నమ్రత శిరోద్కర్ లకు 17వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ ఇద్దరు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ మహేష్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్ లు ఒకే పిక్ లో కనపడటంతో అభిమానులు ఆనందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు