NTR : ఫ్యాన్స్‌ను ఉద్దేశించి జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పెష‌ల్ పోస్ట్‌..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు.

NTR post : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సంగ‌తి అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఆయన‌కు విషెస్ తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో అభిమానుల ఉద్దేశించి ఎన్టీఆర్ ఓ స్పెష‌ల్ పోస్ట్‌ను పంచుకున్నారు.

ప్రియమైన అభిమానులారా.. న‌టుడిగా నా ప్రయాణం మొదలైన మొద‌టి రోజు నుంచి మీరంతా నాకు అండ‌గా ఉన్నారు. నన్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. మీ అసామాన్య ప్రేమ‌కు కృత‌జ్ఞుడిని. దేవ‌ర సినిమాలోని దేవ‌ర పాట‌కు మీ అంద‌రి నుంచి వ‌చ్చిన స్పంద‌న ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు అందరికీ ధన్యవాదాలు అని ఆ నోట్‌లో ఎన్టీఆర్ తెలిపారు.

Bangalore Rave Party: వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా త‌రువాత ఎన్టీఆర్ వ‌రుసగా భారీ చిత్రాల‌ను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2 మూవీలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి అప్‌డేట్‌ను ఇచ్చారు. ఆగ‌స్టు 2024 నుంచి ఈ చిత్ర షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. ఇక దేవర మూవీ పార్ట్ 1 అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Gam Gam Ganesha Trailer : ఆనంద్ దేవ‌ర‌కొండ ‘గం గం గణేశా’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

ట్రెండింగ్ వార్తలు