Viral Video : అయ్యో బౌండరీ ఇలా కొట్టాలని తెలియక.. ఇన్నాళ్లు..!
క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.
- Thota Vamshi Kumar
- Updated on- May 21, 2024 / 11:24 AM IST
Viral Video Ricardo Vasconcelos gets dismissed in unusual way in County Championship
Viral Video : క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు బ్యాటర్లు ఔట్ అయ్యే తీరు నవ్వులను పూయిస్తుంది. కావాలని వాళ్లు అలా ఔట్ అవ్వరు గానీ.. అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ఎన్ని సార్లు చూసినా కానీ నవ్వకుండా ఉండలేం. తాజాగా ఓ బ్యాటర్ ఔటైన విధానానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని కౌంటీ ఛాంపియన్షిప్ లో చోటు చేసుకుంది. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో భాగంగా డెర్బీషైర్, నార్తాంప్టన్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. నార్తెంట్స్ ఓపెనర్ రికార్డో వాస్కోన్సెలోస్ (65 బంతుల్లో 41) అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకువెలుతున్నాడు.
ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన వాస్కోన్సెలోస్.. ఆఫ్ స్పిన్నర్ రాగానే అతడి పై ఎదురుదాడికి దిగాలని భావించాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ బంతిని వేయగా వాస్కోన్సెలోస్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఫ్రంట్ ఫుట్కు వచ్చాడు. బంతిని బలంగా బాదే క్రమంలో బ్యాట్ పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బ్యాట్ అమాంతం అతడి చేతుల్లోంచి ఎగిరిపోయి చాలా దూరం పడింది. అదే సమయంలో బంతి వికెట్లు వెళ్లి నేరుగా తాకింది. దీంతో అతడు ఔట్ అయ్యాడు. కాసేపు సదరు బ్యాటర్‌కు ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయ్యో బ్యాట్‌ను బౌండరీ లైన్ దాటించాలా ఇది తెలియక ఇన్నాళ్లు అనవసరంగా బాల్‌ను బౌండరీకి పంపింస్తున్నాముగా అని సరదాగా అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీకు ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి.
MS Dhoni : ఐపీఎల్లో ముగిసిన చెన్నై కథ.. ధోని ఏం చేస్తున్నాడో చూశారా?
