Uttar Pradesh : పీడకలలు వస్తున్నాయని చోరీ చేసిన విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇది దైవిక సంఘటనా... అద్భుతమా అనేది తేలక ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దేవాలయంలోని విగ్రహాలను చోరీ చేసిన దొంగలకు చోరీ చేసినప్పటి నుంచి నిద్ర పట్టక పీడకలలు వచ్చాయి.

Uttar Pradesh :  ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇది దైవిక సంఘటనా… అద్భుతమా అనేది తేలక ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దేవాలయంలోని విగ్రహాలను చోరీ చేసిన దొంగలకు చోరీ చేసినప్పటి నుంచి నిద్ర పట్టక పీడకలలు వచ్చాయి. దీంతో భయపడిన వారు దొంగిలించిన వాటిలో రెండు మినహా మిగిలినవి పూజారి ఇంటి బయట ఉంచిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే చిత్రకూట్ జిల్లా తరౌన్హాలోని ఓ పురాతన బాలాజీ ఆలయం నుంచి మే 9వ తేదీ రాత్రి కోట్ల రూపాయలు విలువైన 16 అష్టధాతు విగ్రహాలను దొంగలు దోచుకెళ్ళారు. దీనికి సంబంధించి ఆలయ పూజారి మహంత్ రామ్ బాలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుర్తు  తెలియని వ్యక్తులపై సదర్ కొత్వాలి కార్వీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం ప్రారంభించారు.

ఈ క్రమంలో చోరీకి  గురైన విగ్రహాల్లోని 14 విగ్రహాలు ఆదివారం మహంత్ నివాసానికి సమీపంలోని ఒక గోనె సంచిలో లభ్యమయ్యాయి. వాటతో పాటు ఒక లేఖ కూడా దొరికింది. విగ్రహాలను చోరీ చేసినప్పటి నుంచి తమకు రాత్రి పూట నిద్ర పట్టటం లేదని..పీడకలలు వస్తున్నాయని  తెలిపారు. అందుకే భయంతో ఈవిగ్రహాలను తిరిగి ఇచ్చివేస్తన్నట్లు ఆ లేఖలో  రాసి ఉంది. దొంగలు ఇచ్చిన విగ్రహాలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ లో భద్రపరిచామని నిందితులను పట్టుకునేందుకు  గాలింపు చేపట్టి నట్లు  పోలీసులు తెలిపారు.

Also Read : Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు

ట్రెండింగ్ వార్తలు