MadhyaPradesh CM : మూత్ర విసర్జన ఘటనలో.. గిరిజన బాధితుడి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్

మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించి స్వయంగా అతని కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు.

CM Shivraj Singh Chouhan

CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్‌ (MadhyaPradesh) లో ఆదివాసీ వ్యక్తి (Adivasi person) పై మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ అయింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) స్పందించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించి ఈనెల 5న తెల్లవారు జామున అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేయించారు. తాజాగా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడు కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Madhyapradesh: బుల్డోజర్‌తో కూల్చేశారు.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి ఇల్లు కూల్చివేత

మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని సీఎం చౌహాన్ భోపాల్ లోని తన నివాసానికి గురువారం పిలిపించారు. స్వయంగా బాధితుడికి ఎదురెళ్లి తన నివాసంలోకి స్వాగతం పలికారు. అనంతరం అతన్ని కూర్చీపై కూర్చోబెట్టి సీఎం స్వయంగా బాధితుడి కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు. అనంతరం సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించిన వీడియో నన్నెంతో బాధిందించింది. ఈ విషయమై క్షమాపణలు కోరుతున్నా. ప్రజలే నాకు దేవుడితో సమానం అని బాధితుడితో సీఎం తెలిపారు. ఈ తరహా దుశ్చర్యలను సహించేది లేదని, రాష్ట్రంలోని ప్రతిపౌరుడి గౌరవం తన గౌరవమేనని పేర్కొన్నారు.

 

ఈ ఘటన సీధి జిల్లాలో జరిగింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద నిందితుడు ప్రవేశ్ శుక్లాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతన్ని జైలుకు పంపించారు. అయితే, ఈ ఘటనలో నిందితుడు బీజేపీ వ్యక్తిగా ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాహుల్ గాంధీ ట్విట్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ విద్వేష సంస్కృతికి ఇది అద్దం పడుతోందని అన్నారు. బీజేపీ మాత్రం మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడు మా పార్టీ వ్యక్తి కాదని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు