Opposition Front: తమ ఫ్రంటులోకి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకోలేదో హింట్ ఇచ్చిన అఖిలేష్

రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్‭తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు గల కారణాన్ని అఖిలేష్ ఆదివారం చెప్పకనే చెప్పారు

Opposition Front: సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ కొత్త ఫ్రంటు కట్టారు. శనివారం బెంగాల్ రాజధాని కోల్‭కత్తా వెళ్లిన అఖిలేష్.. సీఎం మమతా బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశయ్యారు. ఈ సమావేశం అనంతరం ఫ్రంట్ ప్రకటన చేశారు. అయితే ఈ ఫ్రంటులోకి కాంగ్రెస్ పార్టీని తీసుకోవడం లేదని శనివారమే బాంబ్ పేల్చారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలంటూ చాలా కాలంగా అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోనో లేదంటే కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఫ్రంట్ ఏర్పడుతుందని అనుకున్నారు.

Delhi: రాహుల్ గాంధీ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భారీ ఎత్తున నిరసన

కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ మొదటి నుంచి దూరంగానే ఉంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటోంది. దీంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీకి మమతకు అస్సలు పొసగదు. కానీ, చాలా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంది. చాలా పార్టీలతో మంచి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాలు కాంగ్రెస్‭తోనే జతకడతాయనే చర్చ పెద్ద ఎత్తునే జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‭వాదీ సైతం హస్తానికి మిత్రపక్షంగానే ఉంటూ వచ్చారు.

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్‭ను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించిన పోలీసులు

రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్‭తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు గల కారణాన్ని అఖిలేష్ ఆదివారం చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ ప్రస్తావన రాగానే.. ‘కాంగ్రెస్ జాతీయ పార్టీ’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే.. తాము ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని, జాతీయ పార్టీలతో కలవబోమని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలను బట్టి చూస్తే.. ఏ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఆ రాష్ట్రంలోనే పోటీ చేస్తుంది. అవసరాన్ని బట్టి ఫ్రంటుగా ఏర్పడతాయని తాజా ఫ్రంట్ ఉద్దేశంలా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు