Dimple Hayathi : పోలీస్ కేసు నమోదుపై సెటైరికల్ గా స్పందించిన డింపుల్ హయతి.. ట్వీట్స్ వైరల్..

ఇవాళ ఉదయం నుండి డింపుల్ గురించి మీడియాలో వస్తుండటంతో తాజాగా దీనిపై డింపుల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.

Dimple Hayathi  :  నటి డింపుల్ హయతి ఇటీవలే హీరోయిన్(Heroine) గా పలు సినిమాలు చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే గోపీచంద్(Gopichand) సరసన రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. అయితే ఇటీవల కొన్ని రోజులుగా తన దురుసు ప్రవర్తనతో తాజాగా పోలీస్ స్టేషన్(Police Station) వరకు వెళ్లి వచ్చింది. డింపుల్ హయతి తన బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ తో కలిసి జూబ్లీహిల్స్‌ లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ లోని IPS అధికారి, అతని డ్రైవర్ తో గత కొన్ని రోజులుగా డింపుల్ పార్కింగ్ స్థలం విషయంలో గొడవ పడుతుంది.

 

ఈ నేపథ్యంలో IPS అధికారి ప్రభుత్వ వాహనాన్ని కాలితో తన్ని, కారుకి అడ్డంగా ఉన్న మెష్ ని తొలగించి, కారుని ఢీకొట్టి రచ్చ చేసింది డింపుల్. ఆ కార్ డ్రైవర్ తో కూడా గొడవ పెట్టుకుంది డింపుల్ హయతి. పలుమార్లు ఆ IPS అధికారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డింపుల్ మళ్ళీ మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. తాజాగా కారు డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు డింపుల్, ఆమె స్నేహితుడిపై 353, 341, 279 సెక్షన్ ల కింద, ప్రభుత్వ కారుని ఢీకొట్టి డ్యామేజ్ చేయడంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదు చేసుకొని డింపుల్ ని, ఆమె ఫ్రెండ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఈ విషయంలో హెచ్చరించి పంపించారు. దీంతో డింపుల్ ప్రవర్తన ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది.

ఇవాళ ఉదయం నుండి డింపుల్ గురించి మీడియాలో వస్తుండటంతో తాజాగా దీనిపై డింపుల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. తన ట్విట్టర్లో.. అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పుని ఆపలేరు, అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పులని దాచలేరు.. సత్యమేవ జయతే అని నవ్వుతూ ఉండే సింబల్స్ పెట్టి ట్వీట్ చేసింది. దీంతో ఈ విషయంలో తన తప్పేమి లేదు, వాళ్ళ చేతిలో పోలీస్ పవర్ ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు అని అర్ధం వచ్చేలా ట్వీట్స్ చేసింది డింపుల్. దీంతో డింపుల్ హయతి చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలుసా?

అలాగే డింపుల్ నడిపే కార్ ఆమె బాయ్ ఫ్రెండ్ డేవిడ్ పేరుతో ఉంది. మీడియాలో ఈ కథనాలను రావడంతో పాటు ఆ కారు పై ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయని కూడా రావడంతో మీడియాలో వార్తలు వచ్చిన పది నిమిషాలకే డింపుల్ ఆ చలాన్లు కట్టేయడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు