Falling Temperatures : తెలంగాణపై చలిపులి పంజా..గిన్నెదరిలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 3.5 డిగ్రీలకు పడిపోయింది.

temperature of 3.5 degrees in Ginnedari : తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతగా చలి వణికిస్తోంది. బయటకు వెళ్లాలంటేనే హడలెత్తిస్తోంది. ఉదయం 10 గంటలైనా చలిమాత్రం వదలడం లేదు. కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో చలి విజృంభిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 3.5 డిగ్రీలకు పడిపోయింది. సిర్పూర్‌ – యూలో 4 డిగ్రీలకు పడిపోయింది. ఇక వాంకిడిలో 5 డిగ్రీలు, మాంగృడ్‌లో 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Omicron Death : అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

హత్నూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.3 డిగ్రీలకు చేరాయి. లోకారిలో 5.6 డిగ్రీలు, జైనథ్‌లో 4.9, బేలలో 3.8, ఆర్లి టిలో 3.9 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. సింగిల్‌ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో.. ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. పట్టపగలైనా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏజెన్సీలో వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ మొత్తం చలి గుప్పిట్లో చిక్కుకుంది.

ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఉదయం పూట విధులు నిర్వర్తించే పారిశుద్ద్య కార్మికులు, పాలు సరఫరా చేసే వారు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఉదయం స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగరీత్యా రాకపోకలు సాగించే ఎంప్లాయీస్‌ సైతం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా 81 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు.. 97 దేశాలకు పాకిన కొత్త వేరియంట్

ఆదిలాబాద్‌ ఏజెన్సీని మొత్తం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు నెగళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు రక్షణ లేకుండా చలిలో బయటకు వెళ్తే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా వాసులనూ చలి వణికిస్తోంది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా.. 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గాయి. దీంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఈనెల 14న కరీంనగర్‌లో 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా…. నాలుగు రోజులుగా ఇది 11 డిగ్రీలకు పడిపోయింది. నిన్న ఇది మరింత పడిపోయి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Christmas Celebrations : సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బలంగా వీస్తున్న శీతల గాలులతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలంతా ఆ సమయానికే ఇళ్లకు చేరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు