Teesta Setalvad: గుజరాత్ అల్లర్ల కేసులో యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‭కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. వెంటనే లొంగిపొమ్మంటూ ఆదేశాలు

2002 నాటి అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతో తీస్తాకు అహ్మద్ పటేల్ డబ్బులు ఇచ్చారని, గుజరాత్‌ను అపఖ్యాతిపాలు చేయాలనే లక్ష్యంతో ఓ రాజకీయ నేతకు పరికరంగా ఆమె వ్యవహరించారని ప్రభుత్వం కోర్టులో వాదించింది

Teesta Setalvad

Gujarat High Court: 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‭కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలను ఆమె కల్పించి, సృష్టించారని నమోదైన కేసులో ఆమెకు సాధారణ బెయిలు మంజూరు చేసేందుకు హైకోర్టు శనివారం నిరాకరించింది. అంతే కాకుండా.. ఆలస్యం చేయకుండా లొంగిపోవాలని ఆమెను కోర్టు ఆదేశించింది.

Parliament Monsoon Session: విడుదలైన పార్లటెంట్ సమావేశాల షెడ్యూల్.. ప్రారంభం పాత భవనంలో, ముగింపు కొత్త భవనంలో..

ఆ సమయంలో రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా మరికొందరిని ఇరికించేందుకు తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని కేసు నమోదైంది. ఇందుకు ఆమె విస్తృత స్థాయి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు అహ్మదాబాద్ డిటెన్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు ఆమె సహ నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌ను గుజరాత్ పోలీసులు గత ఏడాది జూన్ 25న అరెస్టు చేశారు. వారం రోజుల పోలీస్ రిమాండ్ అనంతరం జూలై రెండవ తేదీన జ్యుడిషియల్ కస్టడీకి ఆమెను తరలించారు.

Telangana Politics: కూతురు, అల్లుడి వ్యవహారంపై కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

అయితే గత ఏడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. దీంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. ఇక తనకు సాధారణ బెయిలు మంజూరు చేయాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె తప్పుడు సాక్ష్యాలను సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, బెయిలు మంజూరు చేయవద్దని హైకోర్టును గుజరాత్ ప్రభుత్వం కోరింది. కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ నుంచి ఆమె 30 లక్షల రూపాయలు తీసుకున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు ముందు చెప్పారు.

France Protests: అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఆందోళనలు

2002 నాటి అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతో తీస్తాకు అహ్మద్ పటేల్ డబ్బులు ఇచ్చారని, గుజరాత్‌ను అపఖ్యాతిపాలు చేయాలనే లక్ష్యంతో ఓ రాజకీయ నేతకు పరికరంగా ఆమె వ్యవహరించారని ప్రభుత్వం కోర్టులో వాదించింది. గుజరాత్ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమీన్ వాదనలు వినిపిస్తూ, 2002లో గోద్రా రైలు దుర్ఘటన తర్వాత జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని ప్రచారం చేసేందుకు, అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు తీస్తా సెతల్వాద్, పోలీసు అధికారులు శ్రీకుమార్, సంజీవ్ భట్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఆమెకు బెయిలు మంజూరు చేయరాదని కోరారు.

Police Recruitment: అభ్యర్థుల వయసు సడలింపు వివాదంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ కీలక ప్రకటన

గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, తదితరుల ప్రమేయం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు జకియా పిటిషన్‌ను గత ఏడాది జూన్ 24న తోసిపుచ్చింది. ఆ మర్నాడే తీస్తా సెతల్వాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తాజా విచారణ అనంతరం జస్టిస్ నిర్జర్ దేశాయ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తూ, తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తును డిస్మిస్ చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు