Carrot Juice : పొట్ట కొవ్వు కరగాలంటే…. ఈ జ్యూస్ తాగటం బెటర్

ఇక అధిక బరువుతోపాటు, పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ను కరిగించుకునేందుకు క్యారెట్ జ్యూమ్ బాగా పనిచేస్తుంది. క్యారెట్లలో విటమిన్లు బి1, బి2, బి6లు అధికంగా ఉంటాయి.

Carrot Juice : ప్రతిరోజు మనం తీసుకునే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ ను కూరగా వండుకుని తినటమే కాకుండా జ్యూస్ గా చేసుకుని కూడా తాగవచ్చు. కొంత మంది పచ్చి క్యారెట్లనే తింటుంటారు. క్యారెట్ లో ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు కలిగిస్తాయి. క్యారెట్ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిది.

మహిళలు క్యారెట్ ను జ్యూసుగా చేసుకుని తాగటం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులను దరిచేరకుండా చూడవచ్చు. విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్ జ్యూస్ ప్రతిరోజు ఒక గ్లాసు తీసుకునే వారిలో చర్మ సౌందర్యవంతంగా ఉంటుంది. చర్మ ముడతలు తొలగిపోయి ముసలితనం చాయలు కనిపించకుండా యవ్వనంగా కనిపించేందుకు క్యారెట్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యారెట్ లో ఐరన్ ఎక్కవగా ఉండటం వల్ల రక్తం వృద్ధి చెంది రక్తహీనత పోగొడుతుంది. క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల మలబద్ధకం తొలగిపోయి జీర్ణ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. క్యారెట్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కవగా ఉండటంవల్ల శరీరంలోని ద్రవాలు సమత్యుల్యతకు అస్కారం ఉంటుంది. త్వరగా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది మనల్ని కాపాడుతుంది.

ఇక అధిక బరువుతోపాటు, పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ను కరిగించుకునేందుకు క్యారెట్ జ్యూమ్ బాగా పనిచేస్తుంది. క్యారెట్లలో విటమిన్లు బి1, బి2, బి6లు అధికంగా ఉంటాయి. కొవ్వులు , ప్రొటీన్లను జీర్ణం అయ్యేలా చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే బి విటమిన్ శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చు అవ్వటంతో కొవ్వు కరిగి బరువు బాగా తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది.

రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ టిఫెన్ చేసే సమయానికి ముందు తీసుకుంటే మంచిది. చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే ఐరన్ , ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్లు రోగనిరోధక శక్తిని పెంపొందించి, కొవ్వులను కరిస్తాయి. హైబీపిని అదుపులో ఉంచి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. చర్మం పై మచ్చలు, మొటిమలు వంటి వాటిని తొలగించటంలో సహయాపడుతుంది.శ్వాసకోశ సమస్యలు, వత్తిడి సమస్యలు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్ జ్యూస్ ను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ ను చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత యాలుకలు, పొదీనా వేసి మరోసారి మిక్సీ వేసుకుని వచ్చిన నీటిని వడపొసుకోవాలి. రుచికోసం కాస్త తేనె కలుపుకోవాలి. సులభంగా క్యారెట్ జ్యూస్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు