iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?.. ఇండియా ఐస్టోర్‌లో భారీ తగ్గింపు.. ధర ఎంతంటే?

మీరు iPhone 13 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇది మీకోసమే.. ఇండియా ఐసోర్ట్‌‌లో భారీ తగ్గింపుతో ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు. ఒరిజినల్ ధర కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

iPhone 13 Sale in India : మీరు iPhone 13 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇది మీకోసమే.. ఇండియా ఐసోర్ట్‌ (iStore)లో భారీ తగ్గింపుతో ఈ ఐఫోన్ 13 మోడల్ సొంతం చేసుకోవచ్చు. ఒరిజినల్ ధర కన్నా తక్కువ ధరకే అందుబాటులో
ఉంది. వాస్తవానికి ఈ ఐఫోన్ 13 (iPhone 13) ధర విలువ మార్కెట్లో రూ.79,900గా ఉంది. ఇంత ధర పెట్టి కొనలేము అనుకునే వారికి ఇదే సరైన సమయం.. India iStore అందించే డీల్‌ ఓసారి చెక్ చేసుకోండి. ఐఫోన్ 13 (iPhone 13) 128GB
వేరియంట్ ధర రూ. 79,900గా ఉంది.

ఈ ఐస్టోర్ ద్వారా కేవలం రూ. 50,900 ధరకే పొందవచ్చు. iPhone 13 సెప్టెంబర్ 2021లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. iPhone 13 సిరీస్‌లో iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max వేరియంట్లు అందుబాటులో ఉన్నారయి. 2022 ఏడాదిలో Apple కంపెనీ సెప్టెంబర్‌లో iPhone 14 మోడల్ లాంచ్ చేయనుంది. కానీ, ఈలోగా iPhone 13 కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు ధరతో పొందవచ్చు. ఇండియా iStore నుంచి 128GB వేరియంట్ iPhone 13 రూ. 50,900 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

iPhone 13 (128GB వేరియంట్) ధర రూ. 79,900 ఉండగా.. ఇండియా iStore రూ. 5000 ఫ్లాట్ స్టోర్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ. 6వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ డెబిట్ క్రెడిట్
కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లతో సహా బ్యాక్ కార్డ్‌లపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు.. India iStore మీ పాత డివైజ్‌పై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌కి బదులుగా రూ.18వేల వరకు సొంతం చేసుకోవచ్చు. మీరు
వాడే ఫోన్లలో iPhone XR, iPhone 11 లేదా iPhone 12 ఉంటే.. Exchange Value మీ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ ఫోన్ ఫిజికల్‌గా దెబ్బతింటే.. పూర్తి మొత్తాన్ని తిరిగి పొందలేరు. మీరు మీ పాత ఫోన్‌కు సంబంధించి సరైన
వివరాలు కలిగిన ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.

Iphone 13 Sale Iphone 13 Selling At An Effective Price Of Rs 50,900 On India Istore

iPhone 13 డీల్ ఇదే :
– iPhone 13 128GB అసలు ధర : రూ. 79,900
– India iStoreలో ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ధర రూ. 5,000
– బ్యాంక్ ఆఫర్, క్యాష్‌బ్యాక్: రూ. 6000
– ఇన్‌స్టంట్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ iPhone 13 ధర: రూ. 68,900
– ఎక్స్ఛేంజ్ బోనస్ ధర : రూ. 18000 వరకు
– గరిష్టంగా iPhone 13 ధర: రూ. 50,900 వరకు పొందవచ్చు.

ఇండియ ఐస్టోర్ అందించే ఈ డీల్.. ఐఫోన్ 13 ఫోన్ (128GB వేరియంట్‌)పై మాత్రమే కాదు.. 256GB, 512GB మోడల్ వేరియంట్లపై కూడా వర్తిస్తుంది. 256GB వేరియంట్ ధర రూ.89,900 నుంచి రూ.60,900కి తగ్గుతుంది. 512GB వేరియంట్‌ ధర రూ. 80,900 వరకు కొనుగోలు చేయొచ్చు. ఇండియా iStore మాత్రేమ కాకుండా Aptronixindia, FutureWorld, MyImagineStore వంటి పార్టనర్ స్టోర్‌లలో కూడా ఈ డీల్ అందుబాటులో ఉంది.

Read Also : iPhone 12 mini Sale : ఐఫోన్ 12 మినీపై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌‍‌కార్ట్‌లోనే.. ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు