James Cameron : టైటాన్ కథ విషాదాంతం.. కానీ టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అక్కడికి 33 సార్లు వెళ్ళొచ్చాడు..

జేమ్స్ కామెరూన్ కి కూడా ఇలాంటి సాహస యాత్రలు అంటే ఇష్టం. ఇప్పటికే ఈయన ఇలాంటి సాహస యాత్రలు చాలా చేశారు. ఆ సాహస యాత్రల్లో భాగంగానే టైటానిక్ దగ్గరికి కూడా వెళ్లొచ్చారు.

Titanic :  గత కొన్ని రోజులుగా టైటాన్(Titan) సబ్ మెరైన్ మిస్ అయిందని వార్తలు వస్తున్నాయి. మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను చూడటానికి కొంతమంది సంపన్నులు ఓ సబ్ మెరైన్ లో సముద్రంలో ప్రయాణించారు. కానీ అది మిస్ అయింది. దీంతో గత మూడు రోజులుగా ఆ సబ్ మెరైన్ కోసం పలు దేశాలు సముద్రంలో వెతుకుతున్నారు. నేడు ఉదయం ఆ టైటాన్ లో ఉండేవాళ్ళు మరణించి ఉండొచ్చని ఆ టైటాన్ సంస్థ ప్రకటించింది.

అయితే ఈ నేపథ్యంలో టైటానిక్ సినిమా తీసిన జేమ్స్ కెమరూన్ ప్రస్తుతం వైరల్ గా మారారు. జేమ్స్ కామెరూన్ కి కూడా ఇలాంటి సాహస యాత్రలు అంటే ఇష్టం. ఇప్పటికే ఈయన ఇలాంటి సాహస యాత్రలు చాలా చేశారు. ఆ సాహస యాత్రల్లో భాగంగానే టైటానిక్ దగ్గరికి కూడా వెళ్లొచ్చారు. గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో టైటానిక్ సాహస యాత్ర గురించి పలు విషయాలని తెలిపారు.

జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు నాకు టైటానిక్ సినిమా తీయాలనే ఆలోచనే లేదు. నాకు సాహస యాత్రలు అంటే ఇష్టం. అలా ఓ సారి టైటానికి మునిగిపోయిన ప్రదేశానికి వెళ్లి వచ్చాను. దాంతో ఆ కథపై ఆసక్తి ఏర్పడింది. దాంట్లో భాగంగానే టైటానిక్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను. ఆ కథ నాకు ఆసక్తిగా అనిపించి తర్వాత సినిమా తీశాను. టైటానిక్ సినిమా కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ లో భాగంగానే మునిగిపోయిన టైటానిక్ నౌక వద్దకు 33 సార్లు వెళ్ళొచ్చాను. డైరెక్టర్ గా దానిని మరింత బాగా చూపించాలనుకున్నాను. భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అదొకటి అని తెలిపారు.

Titanic submarine:టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం..ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన

జేమ్స్ కామెరూన్ టైటానిక్ వద్దకు తన ప్రయాణాన్ని ఒక డాక్యుమెంటరిగా కూడా తీశారు. టైటానిక్ సినిమాని ఒక సాహస యాత్రగా ఆయన భావిస్తారు. ఇలాంటి సినిమాల కోసం ఎన్ని సాహసాలు చేయడానికైనా రెడీ అంటారు జేమ్స్ కామెరూన్. ప్రస్తుతం టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లిన టైటాన్ మునిగిపోవడంతో జేమ్స్ కెమరూన్ గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు