Dasara : 50 ఏళ్ల క్రితం భర్త కట్టించిన అమ్మవారి గుడిలో ముస్లిం మహిళ ప్రత్యేకపూజలు..

దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి గుడిలో ఓ ముస్లిం మహిళ పూజలు చేశారు. 50 ఏళ్ల క్రితం ఆ అమ్మవారి గుడిని ఆమె భర్త కట్టి హిందువులకు అంకితం చేయటం విశేషం.

muslim woman offers special puja at Bhagawati amma : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం.వివిధ మతాలు,కులాలు కలిసికట్టుగా జీవించే లౌకిక దేశం. అటువంటి భారత్ లో హిందువల దేవాలయాల్లో ముస్లింలు పూజలు చేయటం అనే సోదరభావం కలిగిన ఒకే ఒక్క దేశం భారతదేశం అని చెప్పొచ్చు. అటువంటి భారత్ లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి భక్తులతో పూజలందుకుంటోంది.

ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని సాగర్‌ సిటీలోని భగవతి అమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి ఓ ముస్లిం మహిళ ప్రత్యేక పూజలు చేసింది. దీనికి కారణం తెలిస్తే భారతదేశపు గొప్పతనం కనిపిస్తుంది. ఆ అమ్మవారి దేవాలయాన్ని 50 ఏళ్లక్రితం ఆమె భర్త కట్టించిందే కావటం విశేషం.

రైల్వే ఉద్యోగి అయిన తన భర్త 50 ఏళ్ల క్రితం భగవతి అమ్మ దేవాలయాన్ని నిర్మించి హిందూ సమాజానికి అప్పగించారని ముస్లిం మహిళ ఫమీదా తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా మరణించిన తన భర్త నిర్మించిన ఆలయంలో అమ్మవారికి పూజలు చేసానని..ఇలా అమ్మవారిని పూజించటం నా భర్తకు నేనిచ్చే గౌరవంగా భావిస్తున్నానని..అలాగే హిందు ముస్లిం భాయీ భాయూ అనే భారతీయ సంస్కృతిని గౌరవించటం ప్రతీ భారతీయుల కర్తవ్యమని ఆమె ఫమీదా తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు