Kiara Advani: నార్త్ టు సౌత్ ఈమధ్య బాగా ట్రెండ్ అవుతున్న పేరు.. కియారా అద్వాణీ. గ్లామర్ షోతో ఓవైపు.. బిగ్ మూవీస్‌తో మరోవైపు అట్రాక్ట్ చేస్తోంది కియారా. క్రేజీ బాలీవుడ్ మూవీస్ లైనప్‌లో ఉన్నా, సౌత్ ప్రాజెక్ట్స్ వదులుకునేందుకు ఈ హీరోయిన్ ఇష్టపడట్లేదు. ఇప్పుడలానే ఓ పెద్ద డైరెక్టర్‌తో మల్టీ మూవీస్ చేసేందుకు డీల్ కుదుర్చుకుంది.
ట్రిపుల్ ఆర్ హీరోలతో సందడి చేయబోతుందంటూ రీసెంట్గా ట్రెండ్ అయింది కియారా అద్వాణీ. ఎన్టీఆర్ – కొరటాల శివ, రామ్ చరణ్ – శంకర్ సినిమాల్లో ఈ భామ దాదాపు హీరోయిన్గా ఫిక్సయినట్టే. ‘వినయ విధేయ రామ’ తర్వాత చెర్రీతో కియారా చేస్తున్న రెండో సినిమా RC 15. అయితే చరణ్ ప్రాజెక్ట్‌తో పాటు మరో రెండు సినిమాలు చేసేందుకు డైరెక్టర్ శంకర్‌కు కమిట్మెంట్ ఇచ్చింది కియారా. అంటే మొత్తం మూడు సినిమాలు శంకర్ – కియారా కాంబోలో రానున్నాయి.
రణ్వీర్ సింగ్ హీరోగా శంకర్ ‘అపరిచితుడు’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా హీరోయిన్ కియారానే. చరణ్, రణ్వీర్ సినిమాలతో పాటు శంకర్ కాంబోలో రానున్న మరో ప్రాజెక్ట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇక అటు బాలీవుడ్ సినిమాలలో ఫుల్ బిజీగా ఉంది ఈ హాట్ బ్యూటీ. ‘భూల్ భులయ్యా 2’, ‘షేర్షా’, ‘జగ్ జగ్ జియో’, ‘మిస్టర్ లెలే’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కియారా ఖాతాలో.