Shannu – Siri : సిరి-షణ్నులపై ఫైర్ అయిన మాధవీలత..

ఒక పక్క ఫ్రెండ్స్ అంటూనే రొమాన్స్ చేస్తున్న సిరి-షన్ను లపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ మాధవీలత వీళ్ళిద్దరిపై ఫైర్ అయింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో....

Shannu – Siri :  ప్రతి సీజన్ బిగ్ బాస్ లో గొడవలతో పాటు అప్పుడప్పుడు ఎమోషనల్స్, సెంటిమెంట్స్, లవ్ ట్రాక్స్, ఫ్రెండ్షిప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో లవ్ ట్రాక్స్ తక్కువే ఉన్నాయి. కొద్ది రోజుల వరకు మానస్-ప్రియంకల మధ్య లవ్ ట్రాక్ నడిపాడు బిగ్ బాస్. కాని వాళ్ళ కంటే కూడా సిరి – షన్ను లు ఫ్రెండ్షిప్ అంటూనే చేసే హడావిడి ఎక్కువ వైరల్ అయ్యింది. దీంతో ఎపిసోడ్స్ లో వీళ్ళిద్దర్నీ హైలెట్ చేస్తున్నారు. సిరి-షన్ను హౌస్ కి రాకముందు నుంచే ఫ్రెండ్స్. ఇక హౌస్ లోకి వచ్చాక మరింత దగ్గరయ్యారు. ఒక పక్క ఇద్దరూ ఫ్రెండ్స్ అంటూనే ముద్దులు పెట్టుకుంటున్నారు. హగ్గులు ఇచ్చుకోవడం, ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోవడం, హగ్ చేసుకొని పడుకోవడం చేస్తున్నారు. ఇవన్నీ చేయడంతో వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పినా వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వీళ్లిద్దరికీ బయట లవర్స్ ఉండటం విశేషం.

Bigg Boss 5 : స్టెప్పులతో దద్దరిల్లిన బిగ్‌బాస్‌ హౌస్

ఒక పక్క ఫ్రెండ్స్ అంటూనే రొమాన్స్ చేస్తున్న సిరి-షన్ను లపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ మాధవీలత వీళ్ళిద్దరిపై ఫైర్ అయింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో వీళ్లిద్దరి గురించి పెడుతూ ఇద్దర్ని తిట్టింది.

Bigg Boss 5 : నువ్వు నాకు సిస్టర్ ఏంటి? బ్రో అని పిలవకు.. కాజల్ పై శ్రీరామ్ ఫైర్

”సిరిది సిగ్గులేని జన్మ, ఆఫర్స్‌ కోసం దిగజారిన బతుకు, అంత తిట్టినా వాడితోనే స్నేహం అంటుంది. ఓట్ల కోసం, నోట్ల కోసం ఒక మనిషి ఇంతలా దిగజారాలా? హౌస్ లో అందరి ముందు సిరి తల్లిని అవమానించినా ఏం పట్టించుకోకుండా మళ్ళీ వాడితోనే స్నేహం చేస్తుంది. అటు తల్లిని, ఇటు పార్ట్‌నర్‌ను లెక్క చేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. సరేలే నీకు పైసల్‌ కావాలిగా అందుకే షణ్ను ఎక్కడ ముఖం మాడ్చుకుంటాడో అని కన్నా అని ప్రేమగా పిలుస్తావు, కానీ నీ పార్ట్‌నర్‌ (శ్రీహాన్‌)ను మాత్రం పట్టించుకోవు. వాడు మీ అమ్మకు గౌరవం ఇవ్వడు. కానీ నువ్వు మాత్రం వాడిలో పార్ట్‌నర్‌ని చూస్కుంటావు. బిగ్‌బాస్‌ అయ్యాక నిన్ను భరిస్తాడంటే మీ ఆయన దేవుడు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో వచ్చే జన్మలో అయినా మంచి బుద్ధి ఇస్తాడు” అని సిరిపై తీవ్రంగా ఫైర్ అయింది మాధవీలత.

Sonia Agarwal : తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న ‘7/G బృందావన కాలనీ’ భామ

ఇక షణ్ముఖ్‌ గురించి.. ఇమిటేషన్‌ టాస్కులో అతడిని ఇమిటేషన్‌ చేయకూడదట, మరి శ్రీరామ్‌ డ్యాన్స్‌ చేయకపోయినా ఇమిటేషన్‌ టాస్కులో షణ్ను అతని డ్యాన్స్‌ ఎందుకు ఇమిటేట్‌ చేశాడు? శ్రీరామ్‌ ఫీల్‌ అయ్యాడా? స్పోర్టివ్‌ స్పిరిట్‌ ఉండాలి. మనిషి అంటే నీతులు పక్కనోళ్లకు చెప్పడం కాదు. వీడు సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట. ఇంట్లో ఉన్న శ్రీరామ్‌, మానస్‌, సన్నీ కామపిశాచులు మరి! వాళ్లు సిరి హగ్‌ కోసం అల్లాడిపోతున్నారు. అందుకే కదా సిరితో అన్నయ్య అని పిలిపించాడు, ఒక ఫ్రెండ్‌ అనేవాడు ఇంకో ఫ్రెండ్‌ను అన్నయ్య అని ఎందుకు పిలిపిస్తాడు?” అంటూ షణ్ముఖ్ ని కూడా ప్రశ్నించింది మాధవీలత.

Katrina Kaif -Vicky Kaushal:విక్కీ కత్రినా పెళ్లి వేడుకలు

దీంతో మాధవీలత పెట్టిన స్టోరీలు వైరల్ అవుతున్నాయి. షన్ను-సిరిల అభిమానులు మాధవి పై నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. కాని తాను మాత్రం ఏమి పట్టించుకోకుండా పోస్ట్ పెట్టి అగ్గి రాజేసి చేతులు దులుపుకొని తన పని తానూ చూసుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు