Secular and Socialist Words: 10వ తరగతి పుస్తకాల్లో సెక్యూలర్, సోషలిస్ట్ పదాలు మాయం.. తెలంగాణ ప్రభుత్వంపై మాయావతి ఆగ్రహం

రాజ్యాంగం రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రెండుసార్లు విలేకరుల సమావేశంలో లేవనెత్తారు. దీని వల్లే ఇదంతా జరుగుతోంది. బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు చూపించడం కోసమే బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు

Mayawati: తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాల పాఠ్యపుస్తకాల కవర్ పేజీపై సెక్యూలర్, సోషలిస్ట్ అనే పదాలు లేకుండా రాజ్యాంగ ప్రవేశికను ప్రచురించడం వివాదంలో చిక్కుకుంది. ఈ అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ప్రవేశికలో నుంచి ఈ పదాలు కనుమరుగు అవ్వడం ప్రభుత్వ సమగ్రత, పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతన్నాయని ఆమె అన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం చాలా తీవ్రమైందని, పవిత్ర రాజ్యాంగానికి విధేయత అవసరమని మాయావతి అన్నారు.

RUSSIA: రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తాం..వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రతిజ్ఞ

ఈ విషయమై శనివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘తెలంగాణలో 10వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకాల ముఖచిత్రంపై ముద్రించిన రాజ్యాంగ ప్రవేశికను తారుమారు చేశారు. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు అందులో నుంచి కనుమరుగు కావడం ప్రభుత్వ సమగ్రత, పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటువంటి నిర్లక్ష్యం తీవ్రమైన విషయం. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. పవిత్ర రాజ్యాంగానికి విధేయత అవసరం’’ అని హిందీలో ట్వీట్ చేశారు. కాగా, మాయావతి ట్వీట్‭పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

Opposition Meet: అంత చర్చా చేసి రాహుల్ గాంధీని పెళ్లికి ఒప్పించారట.. విపక్షాల మీటింగ్‭పై బీజేపీ షార్ప్ అటాక్

ఈ విషయమై స్పందించిన మాయావతికి కృతజ్ణతలు తెలుపుతూ ‘‘రాజ్యాంగం రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రెండుసార్లు విలేకరుల సమావేశంలో లేవనెత్తారు. దీని వల్లే ఇదంతా జరుగుతోంది. బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు చూపించడం కోసమే బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ నిజానికి వారిద్దరూ ఎప్పుడూ బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి కుట్రలకు వ్యతిరేకంగా మాయావతి నాయకత్వంలో బీఎస్పీ ఎప్పుడూ పోరాడుతుందని, భారత రాజ్యాంగాన్ని కాపాడుతుందని ప్రవీణ్ కుమార్ అన్నారు.

Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు

అయితే పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని ఎస్‌సీఈఆర్‌టీ వివరణ ఇచ్చుకుంది. 10వ తరగతి సామాజిక అధ్యయనాల కవర్ పేజీపై ప్రచురించిన పీఠికలో ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలను తొలగించారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) గురువారం విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఇందిరా గాంధీ హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు పదాలను పీఠికలో చేర్చారని టీఎస్‌యూటీఎఫ్ గుర్తు చేసింది.

2024 Elections: కాంగ్రెస్‭కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఆప్ వ్యవహారం అటు ఇటుగా ఇలాగే ఉంది

భారతదేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో, అమలులో ఉన్న దానికి బదులుగా కొంతమంది కోరుకున్న విధంగా పాత పీఠికను ప్రచురించడం అనేక సందేహాలకు దారి తీస్తుందని ఫెడరేషన్ పేర్కొంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా పర్యవేక్షణ వల్ల జరిగిందా అనే దాని కంటే జరిగిన పొరపాటు చాలా ప్రమాదకరమైందని టీఎస్‌యూటీఎఫ్ పేర్కొంది. సరైన ఉపోద్ఘాతాన్ని ప్రచురించాలని, విచారణ జరిపి, పీఠికను తప్పుగా ప్రచురించినందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ కోరింది.

ట్రెండింగ్ వార్తలు