Rajasthan: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం.. మహిళలపై వేధింపులకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగం ఫట్

బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే నిందితులు, దుర్మార్గులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హిస్టరీ-షీటర్ల వంటి పోలీస్ స్టేషన్లలో వేధింపులకు పాల్పడిన వారి రికార్డు నమోదు చేయబడుతుంది

Ashok Gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు ప్రయత్నించే వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారని ప్రకటించారు. ఇలా చేసే వారి క్యారెక్టర్ సర్టిఫికెట్‌పై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డారని రాసి ఉంటుందని, వారికి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉపాధి లభించదని అన్నారు. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ మంగళవారం తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.

Kamal Nath: 82% హిందువులున్నారు, ఇది హిందూ దేశమే.. కాంగ్రెస్ నేత కమల్‭నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు

‘‘బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే నిందితులు, దుర్మార్గులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హిస్టరీ-షీటర్ల వంటి పోలీస్ స్టేషన్లలో వేధింపులకు పాల్పడిన వారి రికార్డు నమోదు చేయబడుతుంది. ఈ వ్యక్తులు వేధింపుల సంఘటనలలో పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం/పోలీసులు జారీ చేసిన వారి క్యారెక్టర్ సర్టిఫికేట్‌లో పేర్కొంటారు. ఇలాంటి సంఘ వ్యతిరేకులను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు