Naresh : సీనియర్ నటుడు నరేష్.. మొన్న లగ్జరీ కారవాన్.. ఇవాళ లగ్జరీ కార్..

తాజాగా నరేశ్‌ ఓ ఖరీదైన స్పోర్ట్స్‌ కారును సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ లో వెల్లడించారు. 'నా కల నెరవేరింది, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను' అని తన కార్....

Naresh :  క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు సీనియర్‌ నటుడు నరేశ్‌. నరేష్ చేతి నిండా సినిమాలున్నాయి. ఇంట్లో కంటే కారవాన్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారంట. దీంతో ఇటీవలే ఓ లగ్జరీ కారవాన్ ని కొనుగోలు చేశారు. ఈ స్పెషల్ కారవాన్ ని ముంబై నుంచి తెప్పించారని సమాచారం. ఈ కారవాన్ లో ఏసీ, బెడ్‌, మేకప్‌ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్ ఉన్నాయి. దీనికోసం నరేష్ భారీగానే ఖర్చుపెట్టారు.

SSMB28 : త్రివిక్రమ్ మహేష్ సినిమాకి ముహూర్తం క్లాప్..

తాజాగా నరేశ్‌ ఓ ఖరీదైన స్పోర్ట్స్‌ కారును సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ లో వెల్లడించారు. ‘నా కల నెరవేరింది, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అని తన కార్ వీడియోని, కార్ తో పాటు తాను దిగిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ స్పోర్ట్స్ కారును డ్రైవ్‌ చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టారు నరేశ్‌. దీనికోసం కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు