Chiranjeevi going to Delhi Along with Family for Receiving Padma Vibhushan Award
Chiranjeevi – Ram Charan : ఇటీవల రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్(Padma Vibhushan)ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక అవడంతో ఇప్పటికే అభిమానులు, ప్రముఖులు.. అందరూ అభినందనలు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితమే పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులని అందించారు. అప్పుడు కొంతమంది అవార్డుని అందుకోగా రేపు మిగిలిన వారికి ఈ అవార్డుల్ని అందివ్వనున్నారు.
Also Read : Actor Arjun daughter : హీరోయిన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్..! ఆలయంలో పెళ్లి..
దీంతో మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోడానికి నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు. దీంతో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడాన్ని చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.