Actor Arjun daughter : హీరోయిన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్..! ఆలయంలో పెళ్లి..
సీనియర్ నటుడు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు.

Actor Arjun daughter Aishwarya Arjun Wedding Date Fixed
Actor Arjun daughter Aishwarya : సీనియర్ నటుడు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించాడు. ఆయన కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి పీటలెక్కనుంది. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. తమిళ సీనియర్ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఆమె వివాహం జూన్ 10న జరగనుంది. గతేడాది అక్టోబర్ 17న వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరుగగా.. ఇప్పుడు అదే ఆలయంలో పెళ్లి కూడా చేయబోతున్నారు. తమిళ, హిందూ, కన్నడ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుక జరగనుంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులను మాత్రమే హాజరు అయ్యే అవకాశం ఉంది.
Darshini : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘దర్శిని’ రిలీజ్ ఎప్పుడంటే..
ఐశ్వర్య విషయానికి వస్తే.. ‘పట్టాత్తు యానల్’ అనే చిత్రంతో 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కాగా.. కొద్ది రోజుల క్రితం స్వయంగా అర్జున్, తన కూతురిని హీరోయిన్‌గా పెట్టి తెలుగు-తమిళ బాషల్లో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. అదే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.