Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్‌కు టైం సెట్..
'బెదురులంక 2012' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కార్తికేయ నటిస్తున్న చిత్రం 'భజే వాయు వేగం'.
- Thota Vamshi Kumar
- Updated on- May 8, 2024 / 05:14 PM IST
Bhaje Vaayu Vegam release date fix first single Set ayyinde time set
Bhaje Vaayu Vegam release date : ‘బెదురులంక 2012’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కార్తికేయ నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు.
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈసినిమాను మే 31 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో కార్తికేయ బ్యాట్ పట్టుకుని పరుగులు పెడుతున్న స్టిల్ ఉంది.
Chiranjeevi – Ram Charan : ఢిల్లీకి మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ తో కలిసి.. ఎందుకంటే..?
కాగా.. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. రేపు ఉదయం 9.09 గంటలకు ‘సెట్ అయ్యిందే అనే లిరికల్ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మరో వైపు ఐశ్వర్య మీనన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ ఈ చిత్రంలోని ఆమె లుక్‌ను రిలీవ్ చేశారు.
Actor Arjun daughter : హీరోయిన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్..! ఆలయంలో పెళ్లి..
ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తుండగా పీ అజయ్ కుమార్ రాజు సహనిర్మాత.
