Next iPhone SE 4 Launch : భారీ OLED డిస్‌ప్లేతో ఐఫోన్ SE4 వస్తోంది.. ఇంటర్నల్ 5G మోడమ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు..

Next iPhone SE 4 Launch : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే కొద్దిరోజులు ఆగండి. ఆపిల్ ఐఫోన్ కొత్త మోడల్ 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. ఆపిల్ iPhone SE 4 ప్రొడక్టును రీబ్రాండెడ్ వెర్షన్ ప్రవేశపెడుతోంది.

Next iPhone SE 4 Launch : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే కొద్దిరోజులు ఆగండి. ఆపిల్ ఐఫోన్ కొత్త మోడల్ 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. ఆపిల్ iPhone SE 4 ప్రొడక్టును రీబ్రాండెడ్ వెర్షన్ ప్రవేశపెడుతోంది. ప్రముఖ ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం.. నెక్స్ట్ జనరేషన్ iPhone SEలో ఆపిల్ అత్యంత సరసమైన ఐఫోన్ LCDకి బదులుగా OLED ప్యానెల్‌తో వస్తుంది. గత స్మార్ట్‌ఫోన్ మాదిరిగా యూజర్లకు మెరుగైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఐఫోన్ SE 4 ఫోన్ ఇంటర్నల్ 5G మోడెమ్‌తో రావచ్చని Kuo పేర్కొంది. ప్రస్తుతం, iPhone 12 అంతకంటే ఎక్కువ వెర్షన్ ఐఫోన్లలో Qualcomm నుంచి 5G మోడెమ్‌లను కలిగి ఉన్నాయి.

ఐఫోన్ SE 4 ఫోన్ మోడల్ 6.1-అంగుళాలతో iPhone 14 డిస్‌ప్లే కన్నా కొద్దిగా మార్పులు చేయనుందని Kuo పేర్కొంది ప్రస్తుతం 4.7-అంగుళాల డిస్‌ప్లేకు భిన్నంగా ఫోన్ పెద్ద డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్ ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్, గ్లాస్ బ్యాక్‌ను కూడా కలిగి ఉండవచ్చు. Qualcomm X-సిరీస్ 5G మోడమ్‌లకు బదులుగా Apple ఇంటర్నల్ 5G మోడమ్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.

Next iPhone SE 4 Launch : Next iPhone SE may come with bigger OLED display, in-house 5G mode

Apple కేవలం స్మార్ట్‌ఫోన్‌ల కోసమే కాకుండా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్ కోసం కూడా యాజమాన్య మోడమ్‌పై పనిచేస్తుందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా, ఐఫోన్‌లు ఇతర డివైజ్‌లలో సెల్యులార్, Wi-Fi, బ్లూటూత్‌లను ఎనేబుల్ చేయడానికి ఆపిల్ ఆల్ ఇన్ వన్ చిప్‌పై కూడా పనిచేస్తోందని గతంలో నివేదిక పేర్కొంది.

Read Also :  Poco C55 Sale in India : ఫ్లిప్‌కార్ట్‌లో Poco C55 బడ్జెట్ ఫోన్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?

అదే 5G మోడమ్ iPhone 16 సిరీస్‌లో కూడా రానుంది. 2024లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అంటే.. iPhone SE 4 దాదాపు అదే సమయంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త iPhone SE 4 మోడల్ 4nm (5nm మాదిరిగానే) Apple 5G బేస్‌బ్యాండ్ చిప్‌తో రానుంది. ప్రస్తుత ప్లాన్‌గా సబ్-6GHzకి మాత్రమే సపోర్టు ఇస్తుంది. SE 4 ఫోన్ 1H24లో సులభంగా రన్ అవుతుంది. తక్కువ టెక్నాలజీ అవసరాలు కలిగిన iPad, Apple వాచ్ త్వరలో Qualcomm బేస్‌బ్యాండ్ చిప్‌లను నిలిపేయనున్నాయి.

Next iPhone SE 4 Launch : Next iPhone SE may come with bigger OLED display, in-house 5G mode

ఆపిల్ ఐప్యాడ్‌లకు 5G సపోర్టును విస్తరిస్తోంది. యాజమాన్య మోడమ్ టాబ్లెట్‌లలో కూడా రానుంది. Apple Macsలో Intel ప్రాసెసర్‌లను అప్‌గ్రేడ్ చేసింది. సపోర్టెడ్ చిప్‌లను ఉపయోగించడం ప్రారంభించింది (M1, M2 మొదలైనవి). SoCలు (సిస్టమ్-ఆన్-చిప్స్) ఐప్యాడ్ ప్రో, ఎయిర్ మోడల్‌లలో కూడా రానున్నాయి. చివరి iPhone SE 3 2022లో 5G, కొత్త SoCతో లాంచ్ అయింది. డిజైన్, కెమెరాల పరంగా SE2, SE3 మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. Apple రాబోయే SE 4లో కెమెరా టెక్నాలజీని పొందవచ్చు. ఈ ఫోన్ ఛార్జింగ్ USB-C పోర్ట్‌ను కూడా కలిగి ఉండవచ్చు.

Read Also : New Honda Motorcycle : హీరో స్ప్లెండర్‌కు పోటీగా.. న్యూ హోండా 100CC మోటార్‌సైకిల్ వచ్చేస్తోంది.. మార్చి 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు