Self-Quarantine: నో క్వారంటైన్.. విదేశాల నుంచి వచ్చే వాళ్లు 14రోజులు సెల్ఫ్ మానిటర్ చేసుకోవాలంతే..

విదేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదని కొత్త గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సెల్ఫ్ మానిటరింగ్ ను 14రోజుల వరకూ రికమెండ్ చేస్తున్నారు

Self-Quarantine: విదేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదని కొత్త గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సెల్ఫ్ మానిటరింగ్ ను 14రోజుల వరకూ రికమెండ్ చేస్తున్నారు. సోమవారం అంటే ఫిబ్రవరి 14నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొవిడ్-19 వైరస్ రూపాంతరం చెందుతుంది కాబట్టి.. ‘కంటిన్యూగా మానిటర్ చేస్తుండాలి’ అని అందులో పేర్కొన్నారు.

కొత్త గైడ్‌లెన్స్ ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన వారు ఆన్ లైన్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిర్ సువిధా వెబ్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. అందులోనే 14రోజుల ట్రావెల్ హిస్టరీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ట్రావెల్ డేట్ కంటే 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు అప్ లోడ్ చేయాలి.

రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నానని వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి. ఈ ఆప్షన్ కేవలం జాబితాలో ఉన్న 72దేశాల వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, బహ్రెయిన్, ఖతర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో పాటు మరికొన్ని యూరోపియన్ దేశాలు కూడా జాబితాలో ఉన్నాయి.

Read Also : బీజేపీలో చేరిన రెజ్లింగ్‌ స్టార్‌ గ్రేట్‌ ఖలి

సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌లైన్స్ అనుమతిస్తుంది. నెగెటివ్ RT-PCR టెస్ట్ రిపోర్ట్ లేదా COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఎటువంటి లక్షణాలు కనిపించని వారినే ప్రయాణానికి అనుమతిస్తారు. అయినప్పటికీ ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి విమానంలో ఉన్నంతసేపు పాటించాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు