Prasad Imax : ప్రేక్షకుడిపై ప్రభాస్ అభిమానుల దాడి.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రసాద్ ఐమాక్స్..

ఇకపై ప్రసాద్ ఐమాక్స్ వద్ద రివ్యూలకు పర్మిషన్ లేదని నిర్ణయం తీసుకున్నారు యాజమాన్యం.

No more Reviews at Hyderabad Prasad Imax

Prasad Imax :  కొత్త సినిమా రిలీజయిందంటే హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద న్యూస్ ఛానల్స్, పలు యూట్యూబ్ ఛానల్స్ రివ్యూల కోసం పడిగాపులు గాస్తారు. ఇక సినిమా మొదటి రోజు మొదటి ఆట చూసి వచ్చిన ప్రేక్షకులు తమ రివ్యూలని వీరితో పంచుకుంటారు. హైదరాబాద్ లో ఎన్ని థియేటర్స్ ఉన్నా ఎప్పట్నుంచో ఉన్న మల్టిప్లెక్స్ కావడం, సినిమా రిలిజ్ రోజు ప్రముఖులు కూడా ఇదే థియేటర్ కి వచ్చి చూడటంతో ఇక్కడ సినిమా రివ్యూలు తీసుకోవడానికి వస్తారు.

ఈ రివ్యూలతో చాలా మంది బాగుపడ్డారు. కొంతమంది ప్రేక్షకులు కొత్తకొత్తగా, విచిత్రంగా రివ్యూలు చెప్పి ఫేమస్ అయ్యారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే ఈ రివ్యూలని వాళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకొని బాగుపడ్డాయి. ఇప్పుడు ఈ ఇద్దరికీ ప్రసాద్ ఐమాక్స్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై ప్రసాద్ ఐమాక్స్ వద్ద రివ్యూలకు పర్మిషన్ లేదని నిర్ణయం తీసుకున్నారు యాజమాన్యం.

అయితే ఇందుకు కారణం ఇటీవల జరిగిన ఒక సంఘటనే. సాధారణంగా ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. రివ్యూలు కూడా బాగుంది, బాగోలేదు అనే చెప్తారు. అయితే ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిలీజయినప్పుడు ఓ ప్రేక్షకుడు ఆదిపురుష్ సినిమా బాగోలేదని, తనకి నచ్చలేదని చెప్పాడు. దీంతో అక్కడ ఉన్న ప్రభాస్ అభిమానులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన వైరల్ గా మారింది. దీంతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని ప్రసాద్ ఐమాక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో యూట్యూబ్ ఛానల్స్, రివ్యూ చెప్పేవాళ్ళు నిరాశ చెందుతూ ఇది ప్రభాస్ అభిమానుల వల్లే జరిగిందని వారిపై విమర్శలు చేస్తున్నారు.

TG Vishwa Prasad : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ కి మాతృవియోగం..

దీంతో ఇకపై రివ్యూలు ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడ చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రసాద్ ఐమాక్స్ లోపలికి పర్మిషన్ లేదు అంది కానీ రోడ్డు మీద చెప్పలేదు. దీంతో అక్కడే రోడ్డు మీద తీసుకుంటారా లేక ఇంకేదైనా థియేటర్ వద్దకు యూట్యూబ్ ఛానల్స్ వెళ్తారా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు