ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్

అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు.

Vote On Account Budget : ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్ లైన్ లో మంత్రుల నుంచి ఆర్డినెన్స్ ఆమోదం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం కోసం పంపనుంది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగిసింది. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు కు ఆమోదం తీసుకుంది సర్కార్.

సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు. అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కు నిధులు కేటాయించినట్టు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్లు అయ్యింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2024 సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

Also Read : పొలిటికల్ బ్రదర్స్.. పవన్ కల్యాణ్, లోకేశ్ మధ్య రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం

ట్రెండింగ్ వార్తలు