NTR fans thanking you Suriya for responding on demise of fans
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. తెలుగు స్టేట్స్ లో రజినీకాంత్ అండ్ కమల్ హాసన్ కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక్కడి ఆడియన్స్ సూర్యని ఎంతోగానో సొంతం చేసుకున్నారు. ఈ అభిమానంతోనే తన సినిమా రిలీజ్ ని మాత్రమే కాదు సూర్య పుట్టినరోజుని కూడా గ్రాండ్ గా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకి చెందిన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సూర్య బర్త్ డేని సెలబ్రేట్ చేద్దామనుకొని మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయారు.
డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మోపువారిపాలెంలో సూర్య బర్త్ డే బ్యానర్స్ కడుతున్న సమయంలో కరెంటు షాక్ తగిలి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడక్కడే మరణించగా మరో అభిమాని మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఈ ఇద్దరి మరణం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ వార్త సూర్య వరకు వెళ్లడంతో బాధిత కుటుంబాలను ఫోన్ చేసి పరామర్శించాడు. తన పుట్టినరోజు వేడుకల్లో ఇలా జరగడం తనకి ఎంతో బాధని కలిగిస్తుందని బాధ పడ్డాడు.
KTR – Chiranjeevi : మంత్రి కేటీఆర్‌కి చిరంజీవి బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్!
అభిమానుల కుటుంబాలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఆ కుటుంబాలకి తాను తోడుగా ఉంటానని కూడా సూర్య మాటిచ్చాడంట. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా చనిపోయిన ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కావడం విశేషం. దీంతో అభిమానుల మరణ వార్త తెలుసుకొని వెంటనే రియాక్ట్ అయ్యి, వారి కుటుంబాలతో మాట్లాడినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూర్య ని అభినందిస్తున్నారు.
Tnx For Responding @Suriya_offl Anna🥺❤️
A Special Thanks To @NelloreNTRfc 🥺🙏🏻
Jeevitham Motham Neeku Runapadi Vuntaa Bro😭😭
Naa Friend Valla Family Ni Surya Garitho Matladinchi Valla Family Ki Support Ga Vundela Chesinanduku Thank You Bro🥺😭#HappyBirthdaySuriya pic.twitter.com/xhaOUgMDv4
— Naveen Chowdary👑 (@peacefull_life7) July 23, 2023