Omicron BA.2.12.1 : ఢిల్లీ కరోనా బాధితుల్లో ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్.. కొత్త కేసులకు కారణమిదేనా?

Omicron BA.2.12.1 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి నాల్గో వేవ్‌తో పంజా విసిరే పరిస్థితి కనిపిస్తోంది.

Omicron BA.2.12.1 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే మూడు వేవ్‌లతో ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి నాల్గో వేవ్‌తో పంజా విసిరే పరిస్థితి కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో గతకొద్ది వారాలుగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్ కారణమని భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడా ఆ ఒమిక్రాన్ మ్యూటెంట్ అయ్యి మరో కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందినట్టు సైంటిస్టులు భావిస్తున్నారు. ఢిల్లీలో కరోనా బారినపడిన బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో ఒమిక్రాన్ కొత్త BA.2. 12.1 మ్యూటెంట్ వేరియంట్ ఉందని నిర్ధారణ అయినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2కు సంబంధించిన SARS CoV 2 కొత్త మ్యూటెంట్ వేరియంట్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఢిల్లీ చుట్టుపక్కల జిల్లాల్లో COVID-19 కేసుల పెరుగుదలకు ఈ కొత్త మ్యుటేట్ వేరియంట్ ప్రధాన కారణమని భారత కరోనావైరస్ జెనోమిక్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ INSACOG వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని NCDC డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ ఢిల్లీలో Omicron BA.2.12.1 వేరియంట్‌ను గుర్తించినట్లు ధృవీకరించారు. ఈయన INSACOG ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ కు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు.

గత కొన్ని రోజులుగా ఈ వేరియంట్ బారినపడిన అనేక మంది బాధితుల నమూనాలను పరీక్షిస్తున్నారు. వారిలో ఎక్కువమందిలో BA.2.12.1 వేరియంట్ గుర్తించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా కొత్తవేరియంట్లలో BA.2.12.1, BA.2.12తో పాటు, Omicron BA.2 సబ్‌వేరియంట్ కేసులను న్యూయార్క్‌లోని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. ఈ వేరియంట్ క్రమంగా మ్యుటేట్ చెంది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సైంటిస్టులు సైతం హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని కరోనా బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో BA.2.12.1 ఉందని నిర్ధారించినట్టు NCDCలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Omicron Ba.2.12.1 Mutant Detected In Covid 19 Patients In Delhi, May Be Driving New Surge

భారత్ లో కనుగొన్న కొత్త సబ్‌వేరియంట్ BA.2.12.1 ఎంతవరకు ప్రమాదమనే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో SARS CoV సోకిన వ్యక్తులలో తిరిగి సోకే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. COVID-19 నిఘా ప్రోగ్రామ్‌లో భాగంగా న్యూయార్క్ వెల్లడించిన నివేదికల ప్రకారం చూస్తే.. BA.2.12 అనే ఒమిక్రాన్ మ్యుటేట్ వేరియంట్.. BA.2 సబ్‌వేరియంట్ కన్నా అత్యంత తీవ్రమైనదిగా గుర్తించారు. అయితే ఒమిక్రాన్ BA.2 వేరియంట్ తేలికపాటి లక్షణాలే కనిపించేవి.. కానీ, ఈ కొత్త వేరియంట్ ప్రధానంగా ఎగువ శ్వాసకోశను మాత్రమే దెబ్బతీస్తుందని గుర్తించారు. దీనికారణంగానే ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావవం ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు :
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో కరోనా కేసుల పెరుగుదల భారీగా కనిపిస్తోంది. ఏప్రిల్ 21న ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 2, 380 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే యాక్టివ్ కేసులు 13,433 కు పెరిగాయి. కొన్ని రోజుల క్రితం, దేశంలో రోజువారీ కరోనా కేసులు 1,000 కంటే తక్కువగా ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసులు దాదాపు 9,000 కన్నా తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 11న, దేశంలో 861 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు 11,058గా ఉన్నాయి. 10 రోజుల వ్యవధిలో రోజువారీ కరోనా కేసులు 176 శాతం పెరిగాయి. యాక్టివ్ కేసులు 21 శాతానికి పైగా పెరిగాయని అధికారిక గణాంకాలు తెలిపాయి. గత 24 గంటల్లో 1,009 కేసులు నమోదయ్యాయి.

Read Also : Omicron New Variant XE : ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు

ట్రెండింగ్ వార్తలు