Ushna Shah : పాకిస్థాన్ నటికి పెళ్లి చేసిన ఇండియన్ డైరెక్టర్.. నా భర్తని కలవడానికి ఈయనే కారణం అంటూ పాక్ నటి పోస్ట్..

తాజాగా ఉస్నా షా మరోసారి వార్తల్లో నిలుస్తుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉస్నా షా.

Pakisthan Actress Ushna Shah shares pic with Director Anurag Kashyap goes viral

Anurag Kashyap :  పాకిస్థాన్ కి చెందిన నటి ఉస్నా షా పలు సినిమాలు, సీరియల్స్ లో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఉస్నా షా పాకిస్థాన్ కి చెందిన గోల్ఫ్ ప్లేయర్ హమ్జా అమీన్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఈమె పెళ్లి పాకిస్థాన్ లో సంచలనంగా మారింది. ముస్లిం పద్దతిలో కాకుండా హిందూ పద్దతిలో ఉస్నా షా పెళ్లి చేసుకోవడం, రెడ్ లెహంగా వేసుకొని పెళ్లికూతురు బాగా ముస్తాబవడం, పెళ్ళికి సంబంధించిన వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాకిస్థాన్ నెటిజన్లు ఉస్నా షాని బాగా ట్రోల్ చేశారు. అయినా తాను వీటికి స్పందించలేదు.

తాజాగా ఉస్నా షా మరోసారి వార్తల్లో నిలుస్తుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉస్నా షా. ఈ ఫోటో షేర్ చేసి.. ఈయన ఒక జీనియస్. ఈయన క్రాఫ్ట్ లో ఒక మాస్టర్. ఇతని దగ్గర చాలా నేర్చుకున్నాను. ఈయన ఒక గ్రంధాలయం లాంటి వారు. నేను భర్తను కలవడానికి కారణం కూడా ఇతనే అని పోస్ట్ చేసింది. దీంతో ఉస్నా షా చేసిన పోస్ట్ వైరల్ అవ్వగా పలువురు పాకిస్థాన్ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నువ్వు కూడా ఇండియా వెళ్ళిపో, ఇండియన్ సినిమాలు చేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే మీ ఇద్దరు కలిసి ఏ ప్రాజెక్టు కి వర్క్ చేయలేదు, మీకు ఎలా పరిచయం అని కామెంట్స్ చేస్తున్నారు.

Venkatesh : వెంకటేష్‌తో స్వామి వివేకానంద సిరీస్.. వెంకటేష్ ఒప్పుకున్నారు కానీ..

మరి ఈ బాలీవుడ్ డైరెక్టర్ కి, పాకిస్థాన్ నటికి ఎలా పరిచయం అయిందో, ఈ ఫోటో ఎక్కడ దిగారో, అనురాగ్ వల్ల ఉస్నా తన భర్తని ఎలా కలిసిందో అని తమ అనుమానాలను కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీ మొత్తం చెప్పమని కోరుకుంటున్నారు. ఇక ఒక పాకిస్థాన్ నటి ఇలా ఇండియన్ డైరెక్టర్ ద్వారా తన భర్తని కలిశాను అని చెప్పడంతో ఈ పోస్ట్ ఇండియాలో కూడా వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు