Phone Call Scam : మీ ఫోన్‌కు ఇలాంటి ఫేక్ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. స్కామర్ల నుంచి సేఫ్‌గా ఉండాలంటే?

Phone Call Scam : మీ ఫోన్‌కు ఇలాంటి కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. అది స్కామర్లు కావొచ్చు.. ఆన్‌లైన్ మోసాల బారినపడకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి..

Phone Call Scam : భారత్‌లో రోజురోజుకీ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. స్కామర్లు అమాయక ప్రజలను మోసగించేందుకు అనేక కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులను నమ్మించి వారి నుంచి డబ్బును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదే.. ఫేక్ వాయిస్ కాల్ స్కామ్ (Fake Voice Call Scam). స్కామర్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫేకే్ వాయిస్ కాల్‌లను క్రియేట్ చేస్తున్నారు.

తద్వారా అమాయకపు యూజర్ల నుంచి పెద్దమొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారు. నివేదిక ప్రకారం.. ఇలాంటి ఫేక్ కాల్‌లను పొందిన భారతీయులలో సగం మంది బాధితులు రియల్ కాల్ అనిపించేలా (AI) రూపొందించిన ఫేక్ వాయిస్ కాల్ మధ్య తేడాను గుర్తించలేక భారీగా నష్టపోయారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ కాల్‌లను స్వీకరించిన వారిలో 83 శాతం మంది తమ విలువైన నగదును కోల్పోయారు.

ఇటీవలే భారత్ సహా ఏడు దేశాలకు చెందిన 7,054 మందితో ‘ది ఆర్టిఫిషియల్ ఇంపోస్టర్’ పేరుతో మెకాఫీ (McAfee) సర్వే నిర్వహించింది . అందులో 69 శాతం మంది భారతీయులు రియల్ వాయిస్‌కి, AI రూపొందించిన క్లోన్‌కి మధ్య వ్యత్యాసాన్ని చెప్పగలరో లేదో కచ్చితంగా తెలియదని సర్వే వెల్లడించింది. అంతేకాదు.. 47 శాతం మంది భారతీయుల్లో AI వాయిస్ స్కామ్‌కు గురైనవారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ స్కామ్‌లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. డబ్బు పోగొట్టుకున్న 48 శాతం మంది భారతీయుల్లో రూ. 50వేల కన్నా ఎక్కువ మొత్తంలో నగదును నష్టపోయారని తెలిపారు.

సర్వే సమయంలో మెకాఫీ పరిశోధకులు ఆన్‌లైన్‌లో అనేక AI వాయిస్-క్లోనింగ్ టూల్ ఉన్నాయని కనుగొన్నారు. ఈ టూల్స్ చాలా అడ్వాన్సడ్ టెక్నాలజీ కలిగి ఉన్నాయని తెలిపారు. కేవలం 3 సెకన్ల ఆడియోతో 85 శాతం వాయిస్ కాల్స్ క్రియేట్ చేయగలవు. McAfee పరిశోధకులు కేవలం కొన్ని వీడియో ఫైల్‌లతో డేటా మోడల్‌లకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా 95 శాతం వాయిస్ మ్యాచ్‌ని కూడా గుర్తించారు. నివేదికలు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. ఫేక్ కాల్‌లను గుర్తించడం, స్కామ్‌లో చిక్కకుండా ఎలా సేఫ్‌గా ఉండటమనేది ప్రశ్నగా మారింది. అయితే, ఈ సమస్యకు పరిష్కారాన్ని పొందే ముందు.. ఈ స్కామ్‌లు ఎలా పని చేస్తాయో ముందుగా లోతుగా పరిశీలిద్దాం.

Read Also : Amazon Great Summer : ఈ రాత్రి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ముందుగా వారికే.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

AI ద్వారా ఫోన్ కాల్ స్కామ్ ఎలా చేస్తారంటే? :
ఏఐ ఫోన్ కాల్ స్కామ్‌లలో.. స్కామర్‌లు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల మాదిరిగా ఫేక్ వాయిస్ లను క్రియేట్ చేసేందుకు AI వాయిస్ జనరేటర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. స్కామర్‌లు ఈ వాయిస్‌లను కాల్ చేయడానికి లేదా మెసేజ్ చేయడానికి ఉపయోగిస్తారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లు నమ్మిస్తూ.. అత్యవసరంగా డబ్బు కావాలని అడుగుతారు. పట్టుబడకుండా ఉండేందుకు క్రిప్టోకరెన్సీ లేదా గిఫ్ట్ కార్డ్‌ల వంటి గుర్తించలేని పద్ధతులను ఉపయోగిస్తారు.

ఫోన్ కాల్ స్కామ్ నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
AI వాయిస్ స్కామ్‌ల నుంచి మిమ్మల్ని మీ ఫ్యామిలీని రక్షించుకోవాలంటే తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. అనుమానాస్పద కాల్‌లతో వ్యవహరించేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

Phone call scam cases rising in India, here is how to be safe

* కాలర్‌లను వెరిఫై చేయండి : మీరు కాలర్‌ను వెరిఫై చేసుకోవాలి. కోడ్‌వర్డ్‌ని ఉపయోగించాలి లేదా వారికి మాత్రమే తెలిసిన ప్రశ్నను అడగాలి.

* ఐడెంటిటీ ప్రైవసీ ప్రొటెక్షన్ సర్వీసులను ఉపయోగించండి : కాలర్ ఐడెంటిటీని గుర్తించేందుకు సీక్రెట్ వర్డ్ ఉపయోగించమని లేదా వ్యక్తిగత ప్రశ్నకు సమాధానం చెప్పమని వారిని అడగవచ్చు.

* గుర్తుతెలియని కాల్‌లను లిఫ్ట్ చేయొద్దు :
మీరు కాలర్‌ను గుర్తించకపోతే.. వెంటనే వాయిస్‌మెయిల్‌కి వెళ్లనివ్వండి. వారు మెసేజ్ పంపినట్లయితే.. వారి అధికారిక వెబ్‌సైట్‌తో వారి నంబర్‌ను వెరిఫై చేసుకోండి.

* టెక్స్ట్‌లలోని లింక్‌లను క్లిక్ చేయొద్దు :
ఇలాంటి లింకులను క్లిక్ చేస్తే.. మీ డివైజ్ మాల్వేర్‌ అటాక్ చేయొచ్చు లేదా మిమ్మల్ని ఫేక్ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యేలా చేయొచ్చు.

* OTPని షేర్ చేయవద్దు :
మీ ఫోన్ లేదా టెక్స్ట్ ద్వారా మిమ్మల్ని సంప్రదించే ఎవరికైనా డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకండి. మీ పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌లను ఎవరికి షేర్ చేయొద్దు.

* రిమోట్ యాక్సెస్‌ను అనుమతించవద్దు :
మీ డివైజ్ రిమోట్‌గా యాక్సెస్ చేసేందుకు ఎవరినీ అనుమతించవద్దు. రిమోట్ యాక్సెస్ మాల్వేర్ లేదా డేటా దొంగలించే ప్రమాదం ఉంది.

* కాలర్ IDని నమ్మకండి :
స్కామర్‌లు కాలర్ IDతో తమ నంబర్‌లను హైడ్ చేస్తారు. ఇలాంటి ఐడీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

* అనుమానాస్పద కాల్‌లను లిఫ్ట్ చేయొద్దు :
అసాధారణమైన లేదా అత్యవసరమైన డిమాండ్‌లకు లొంగకండి. కాల్ వచ్చినా గుర్తు తెలియని నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్సర్ చేయొద్దు.

* అధికారులకు స్కామ్ కాల్‌లను రిపోర్టు చేయండి :
భారత్‌లో సైబర్ మోసాన్ని రిపోర్టు చేయాలంటే.. జాతీయ హెల్ప్‌లైన్ 155260కి కాల్ చేయవచ్చు. ఆన్‌లైన్ పోర్టల్ cybercrime.gov.inని విజిట్ చేయండి లేదా ఇతర ఏజెన్సీలను సంప్రదించండి.

Read Also : Jio VR Headset : జియో ఫస్ట్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ఇదిగో.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయొచ్చు.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ట్రెండింగ్ వార్తలు