Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడ్ పెంచడయ్యా.. మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!

రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచడయ్యా.. ఇలా మళ్లీ సోషల్ మీడియా రచ్చ మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్. మార్చ్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ సైలెన్స్..

Radhe Shyam: రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచడయ్యా.. ఇలా మళ్లీ సోషల్ మీడియా రచ్చ మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్. మార్చ్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ సైలెన్స్ ను బ్రేక్ చేయమనేది వాళ్ల వర్షన్. అందుకే ఫ్యాన్స్ కోసం సడెన్ గా సూపర్ అప్ డేట్ తీసుకొచ్చారు రాధేశ్యామ్ మేకర్స్. మూవీలో విక్రమాదిత్య కథను న్యారెట్ చేసేది చేసేది ఇండియన్ సూపర్ స్టార్ అంటూ మొత్తానికి కొత్త విషయమొకటి చెప్పేశారు.

Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

ఈమధ్యే ప్రాజెక్ట్ కె ఫస్ట్ షాట్ తర్వాత ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు అమితాబ్ – ప్రభాస్. అలాగే అమితాబ్ కు ఇష్టమైన రకరకాల వెజ్ ఐటమ్స్ ఫుడ్ మెనూతో మూవీ సెట్స్ లో సర్ ప్రైజ్ చేశారు గ్లోబల్ స్టార్. ఇలా ఇండియన్ సూపర్ స్టార్, యంగ్ రెబల్ స్టార్.. ఇద్దరికి సంబంధించిన న్యూస్ ట్రెండ్ అవుతుండగానే మరో అప్ డేట్ డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. రాధేశ్యామ్ సినిమా కోసం బిగ్ బి వాయిస్ ఓవర్ అందించారన్న విషయాన్ని రివీల్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

Radhe Shyam: 10 వేల థియేటర్లలో రాధేశ్యామ్.. ఏంటి నిజమా?

బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలకు వాయి ఓవర్ ఇచ్చిన అమితాబ్.. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను న్యారేట్ చేయబోతున్నారు. బిగ్ బి న్యారేషన్ తో 1970స్ బ్యాక్ డ్రాప్ లోని విక్రమాదిత్య స్టోరీ హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. ప్రభాస్ బిహేవియర్ కు ఫిదా అయిన అమితాబ్.. దర్శకనిర్మాతలు అడిగిన వెంటనే రాధేశ్యామ్ వాయిస్ చెప్పడానికి ఎస్ అన్నారు. సో థాంక్యూ షెహన్షా అంటూ సీనియర్ బచ్చన్ కు థ్యాంక్స్ చెప్పింది మూవీ టీమ్.

Radhe Shyam: రాధేశ్యామ్‌కి ఓటీటీ ఆఫర్.. రూ.400 కోట్లకు పైగా డీల్!

వరల్డ్ వైడ్ దాదాపు 10 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది రాధేశ్యామ్. హిందీతో పాటూ సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ వాళ్లు ఎక్స్ పెక్ట్ చేసినట్టు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా మూవీ అప్ డేట్స్ రావట్లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆడియెన్స్ ఎగ్జైట్ అయ్యేలా రాధేశ్యామ్ సెకండ్ ట్రైలర్ తో పాటూ ఫిప్త్ సాంగ్ త్వరలోనే బయటకి రాబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు