Adipurush : ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్(Krithisanan) సీతగా, సైఫ్ అలీఖాన్(saif alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(om raut) ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్ ని రాముడిగా ఊహించుకొని, ఒకప్పటి ఎన్టీఆర్ సినిమాల్లాగా రామాయణం గొప్పగా తీస్తున్నారేమో అనుకున్నారు.
కానీ కొన్ని నెలల క్రితం ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ చూసిన తర్వాత అభిమానులతో పాటు అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది, పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని అనేక విమర్శలు వచ్చాయి. ఆదిపురుష్ సినిమా టీజర్ ని ట్రోల్ చేశారు ప్రేక్షకులు. దీంతో ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్న సినిమాని వాయిదా వేసి గ్రాఫిక్స్, విజువల్స్ లో మరింత మార్పులు చేయాలని మళ్ళీ వర్క్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్.
Gnanavel Raja : సూర్య 42 సినిమాతో బాహుబలికి సమాధానం ఇస్తాం.. తమిళ నిర్మాత వ్యాఖ్యలు..
టీజర్ తో సినిమాకి బాగా నెగిటివిటి రావడంతో సినిమాని వాయిదా వేస్తున్నట్టు, మరింత గొప్పగా చూపిస్తామంటూ 16 జూన్ 2023 లో రిలీజ్ చేస్తామని నవంబర్ లో ప్రకటించారు. ఇక అప్పట్నుంచి సినిమా గురించి మళ్ళీ ఊసే లేదు. జూన్ కూడా త్వరలో వచ్చేస్తుంది, ఓ పక్క శ్రీరామనవమి మార్చ్ 30న రానుంది. దీంతో ఇప్పటికి కూడా అప్డేట్ ఇవ్వరా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ డైరెక్టర్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓం రౌత్ ని ఆదిపురుష్ విషయంలో మరోసారి ట్రోల్ చేస్తూ శ్రీరామనవమికి అయినా ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు. అంతే కాక wake up om raut అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి దీనిపై చిత్రయూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి.
Update Ekkada Ra @omraut#Adipurush #Prabhas #Omraut #AdipurushStormIn100Days#StartAdipurushPromotions pic.twitter.com/Jl2PkUwC8j
— prabhas 🔥 (@VlogsMovie) March 20, 2023
Hero- Bahubali
Director- AliBaba Chalisee Chorr🤣#Adipurush #StartAdipurushPromotions#Prabhas #OmRaut #Bollywood#BoycottBollywood pic.twitter.com/JNuJrnXjRq— PanduGanniFan (@RatanMittu) March 20, 2023