Rajinikanth : కావ్య బాధ‌ప‌డుతుంటే చూడ‌లేక‌పోతున్నా.. మార‌న్ వెంట‌నే ఈ ప‌ని చేయండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) లో గ‌త కొన్ని సీజ‌న్లుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SunRisers Hyderabad) ప్ర‌ద‌ర్శ‌న తీసి క‌ట్టుగా మారింది. ప్ర‌తీ సీజ‌న్‌కు ఆట‌గాళ్ల‌తో పాటు కోచ్ ల‌ను మార్చుతున్నారు.

Rajinikanth Request To SRH Owners : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) లో గ‌త కొన్ని సీజ‌న్లుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SunRisers Hyderabad) ప్ర‌ద‌ర్శ‌న తీసి క‌ట్టుగా మారింది. ప్ర‌తీ సీజ‌న్‌కు ఆట‌గాళ్ల‌తో పాటు కోచ్ ల‌ను మార్చుతున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌ట్టు ఆట‌తీరు మార‌డం లేదు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో అయినా ఎస్ఆర్‌హెచ్ అద‌ర‌గొడుతుంద‌ని భావించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని జ‌ట్టు 14 మ్యాచులు ఆడ‌గా కేవ‌లం నాలుగు మ్యాచుల్లోనే విజ‌యం సాధించి చివ‌రి స్థానంలో నిలిచింది.

డేవిడ్ వార్న‌ర్‌, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, ర‌షీద్ ఖాన్ వంటి ఆట‌గాళ్ల‌ను వ‌దులుకోవ‌డం స‌న్‌రైజ‌ర్స్‌కు చేటు చేసింది. రానున్న సీజ‌న్ల‌లోనైనా ఎస్ఆర్‌హెచ్ మంచి ప్లేయ‌ర్ల‌ను వేలంలో ద‌క్కించుకుని మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రీ రానున్న వేలంలోనైనా హైద‌రాబాద్ జ‌ట్టు మంచి ఆట‌గాళ్ల‌ను ద‌క్కించుకుంటుందో లేదో చూడాల్సిందే.

Yusuf Pathan Video: సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకుల మతిపోగొట్టిన యూసఫ్ పఠాన్.. 26 బాల్స్ 80 రన్స్

తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజ‌న్‌పై సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌న్‌రైజ‌ర్స్ సీఈఓ కావ్య మార‌న్ ప‌డుతున్న బాధ‌ను తాను చూడ‌లేక‌పోతున్నాన‌ని అన్నారు. త‌న రాబోయే సినిమా ‘జైల‌ర్’ చిత్ర ఆడియో లాంచ్‌ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ రజినీకాంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఓడిపోయిన‌ప్పుడు మైదానంలో కావ్య మార‌న్ నిరాశ క‌నిపిస్తుండ‌డాన్ని తాను చూడ‌లేక‌పోతున్నాన‌ని అన్నారు.

ఆమె ప‌డే బాధ‌ను చూడ‌లేక చాలా సార్లు టీవీ ఛాన‌ల్‌ కూడా మార్చేసిన‌ట్లు ర‌జినీ చెప్పుకొచ్చారు. కాబ‌ట్టి క‌ళానిధి మార‌న్‌(కావ్య మార‌న్ తండ్రి)కి ఓ స‌ల‌హా ఇవ్వాల‌ని అనుకున్న‌ట్లు తెలిపారు. మంచి ఆటగాళ్లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి తీసుకురావాలని కోరారు. వేలంలో మెరుగైన ఆట‌గాళ్ల‌ను సొంతం చేసుకోవాల‌ని సూచించారు.

Mens T20 WorldCup 2024 : టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024కి అర్హ‌త సాధించిన ప‌సికూన‌.. ఎవ‌రో తెలుసా..? ఇంకా 5 బెర్తులు ఖాళీగానే..

త‌లైవా చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. ర‌జినీ కాంత్ చేసిన వ్యాఖ్య‌ల‌కు నెటీజ‌న్లు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. తాము కూడా కావ్య పాప‌ను అలా చూడ‌లేక‌పోతున్నామ‌ని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ సారి హెడ్‌కోచ్ బ్రియాన్ లారా పై వేటు వేయాల‌ని స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం బావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ‌త సీజ‌న్‌లో 13.25 కోట్ల‌కు కొన్న హ్యారీ బ్రూక్ ఒక్క మ్యాచ్‌లో మిన‌హా మిగిలిన మ్యాచుల్లో దారుణంగా విఫ‌లం కావ‌డంతో అత‌డిని కూడా వ‌దులుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చూడాలీ మ‌రి ఈ సారి వేలంలోనైనా ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు మంచి ఆట‌గాళ్ల‌ను వేలంలో  ద‌క్కించుకుని కావ్య మార‌న్ ముఖంలో ఆనందం నింపుతుందో లేదో.

Sakshi talks about MS Dhoni : ధోని గురించి చెప్పిన సాక్షి.. ఆనందంలో అభిమానులు.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు