Rahul Gandhi : ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ? మోదీకి ప్రశ్నలు సంధించిన రాహుల్

ఏటా రెండు కోట్ల  ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు.

Rahul Gandhi :  ఏటా రెండు కోట్ల  ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు. దేశ ప్రజల తరుఫున వీటిని అడుగుతున్నట్లు ఆయన తెలిపారు.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని  మోదీ నియంతృత్వం వల్ల 57 మంది ఎంపీలను అరెస్టు చేసి 23 మందిని సస్పెండ్ చేశారని రాహుల్ విమర్శించారు. రాహుల్ గాంధీ మోదీని అడిగిన ప్రశ్నలు….

1. నిరుద్యోగం 45 ఏళ్లలో నేడు అత్యధికంగా ఎందుకు ఉంది? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైంది?
2. పెరుగు, తృణధాన్యాలు వంటి రోజువారీ ఆహార పదార్థాలపై GST విధించి ప్రజల నుండి ఎందుకు కూడును లాక్కుంటున్నారు?
3. వంటనూనె, పెట్రోల్-డీజిల్, సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ప్రజలకు ఉపశమనం ఎప్పుడు?
4. డాలర్‌తో రూపాయి ఎందుకు 80 దాటింది?

5. 2 సంవత్సరాలుగా సైన్యంలో ఒక్క రిక్రూట్‌మెంట్ కూడా చేయకుండా, ఇప్పుడు ప్రభుత్వం ‘అగ్నీపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది, 4 సంవత్సరాల కాంట్రాక్ట్‌పై యువతను ‘అగ్నివీర్’గా ఎందుకు బలవంతం చేస్తున్నారు?6. చైనా సైన్యం లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మన సరిహద్దులోకి ప్రవేశించింది, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు ..ప్రధాని ఏం చేస్తున్నారు?
7. పంటల బీమా.. బీమా కంపెనీలకు 40 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది, అయితే 2022 నాటికి ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇవ్వడంపై ఎందుకు మౌనం వహించారు?

8. రైతుల పంటలకు MSP వాగ్దానం ఏమైంది? రైతు ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు పరిహారం ఏమైంది?
9. సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50% తగ్గింపు ఎందుకు నిలిపివేయబడింది? వృద్ధులకు రాయితీ ఇవ్వడానికి డబ్బు ఎందుకు లేదు?
10. 2014లో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న అప్పు 56 లక్షల కోట్లు, అది ఇప్పుడు 139 లక్షల కోట్లకు పెరిగింది, మార్చి 2023 నాటికి అది 156 లక్షల కోట్లు అవుతుంది, దేశాన్ని ఎందుకు అప్పుల్లో ముంచుతున్నారు?

ప్రధానమంత్రి, దయచేసి నా ఈ 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీని బెదిరించడం వల్ల మీ జవాబుదారీతనం అంతం కాదు.  కాంగ్రెస్ ప్రజల గొంతుక, ప్రజల సమస్యలను లేవనెత్తుతూనే ఉంటాం అంటూ రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాశారు.

మరో వైపు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిందని, అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రాహుల్ విచారణ సమయంలో ఇచ్చిన సమాధానాలనే సోనియాగాంధీ సైతం తనను విచారించిన సమయంలో తెలిపినట్లు తెలిసింది.

Also Read : RBI report: బ్యాంకులు, బీమా సంస్థలు క్లెయిమ్ చేయని సొమ్ము రూ.70వేల కోట్లు

ట్రెండింగ్ వార్తలు