Kedarnath: మంచుతో నిండిపోయిన కేదార్‌నాథ్.. యాత్రకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత

అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ధామ్, 27న బద్రీనాథ్ ధామ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి

Kedarnath yatra

Kedarnath: కేదార్‌నాథ్ యాత్ర (Kedarnath yatra)కు వెళ్లే భక్తుల కోసం రిషికేశ్ (Rishikesh) , హరిద్వార్‌ (Haridwar) లలో అందుబాటులోకి తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ (Registration process) ను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా గర్వాల్ హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, మంచు కురుస్తున్న కారణంగా ఏప్రిల్ 30వరకు యాత్రికుల నమోదు నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం నుంచి కేదార్‌నాథ్ ధామ్ తెరుచుకోనుంది. అయితే, బద్రీనాథ్ (Badrinath) , గంగోత్రి (Gangotri) , యమునోత్రి (Yamunotri)  యాత్రలకు ప్రస్తుతం పేర్ల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి (Registrations ongoing).

Kedarnath Mules: కేదార్‌నాథ్ యాత్రలో మ్యూల్స్ యజమానుల పంట పండింది.. వారి ఆదాయం ఎంతో తెలుసా?

అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. గంగోత్రి ఆలయంలో ప్రధాని మోదీ పేరున తొలి పూజ నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరుకాగా.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి ఖర్సాలీ గ్రామం నుంచి మాతా యమునాదేవి డోలి కార్యక్రమంలో పాల్గొని యాత్రను ప్రారంభించారు. అయితే, ఏప్రిల్ 25న కేదార్ నాథ్ ధామ్, 27న బద్రీనాథ్ ధామ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో ఉన్న నాలుగు యాత్రా స్థలాలను యమునోత్రి ధామ్, చార్‌ధామ్, కేదార్‌నాథ్ ధామ్, బద్రీనాథ్‌లను కలిపి చార్‌ధామ్ అని పిలుస్తారు. ఇవి ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ మతపరమైన యాత్రాస్థలాలు. ఈ కేంద్రాలకు ప్రతీ సంవత్సరం పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తారు.

National Highways: 9 ఏళ్లలో 50,000 కి.మీ. జాతీయ రహదారులు పెరిగాయట

చార్‌ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజర్ అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ మాట్లాడుతూ.. విపరీతమైన మంచు కారణంగా కేదార్ నాథ్ యాత్రకోసం యాత్రికుల నమోదు ప్రక్రియను రిషికేశ్, హరిద్వార్ లలో ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు తెలిపారు. రానున్నరోజుల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు భారతదేశం, విదేశాల నుంచి 16లక్షల మంది భక్తులు చార్ ధామ్ తీర్థయాత్రకోసం నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు.

Summer Heat : వేసవి వేడి కారణంగా పనిలో అలసిపోయారా? తక్షణమే శక్తిని పెంచుకోవడానికి చిట్కాలు !

భారత్, విదేశాల నుంచి తీర్థయాత్రకు వచ్చే భక్తులకోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం జాగ్రత్తలు సూచించింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాత్రను ప్రారంభించాలని కోరింది. భక్తులు వీలైనంత వరకు వెచ్చని దుస్తులను తీసుకెళ్లాలని, ప్రయాణీకులు ప్రయాణ సమయంలో పర్వత వాతావరణానికి అలవాటు పడిఉండాలని సూచించింది. ఇబ్బందులు ఎదురైతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆ తరువాతే ప్రయాణం చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తులకు సూచించింది.

ట్రెండింగ్ వార్తలు