రత్న భండార్ రహస్యం..! జగన్నాథుడి చెక్కపెట్టెల్లో ఏముంది? ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలను లెక్కించడం ఎలా?

ఇప్పుడే అసలు కథ మొదలైంది. రహస్య గది అయితే తెరుచుకుంది. మరి అందులో ఏముంది? నిజంగానే ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు ఉంటే వాటిని లెక్కించడం ఎలా? పర్యవేక్షణ కమిటీ ఏం చెబుతోంది.

Ratna Bhandar Mystery : ఎన్నో ప్రచారాలు, మరెన్నో ఊహాగానాలు, అంతు చిక్కకుండా ఎండింగే లేని సీరియల్ గా, డైలీ ఎపిసోడ్ లాగా కొనసాగిన రత్న భండార్ రహస్యం ఎట్టకేలకు వీడింది. కాకపోతే కొలిక్కి వచ్చేందుకే సమయం పట్టే అవకాశం ఉంది. నాగబంధం అయితే లేదని తేలిపోయింది. 46ఏళ్ల తర్వాత నిధి ఉన్న రత్న భండార్ మూడో గది తాళాలను తెరిచారు అధికారులు. ఎన్నో జాగ్రత్తలు పటిష్టమైన భద్రత నడుమ శుభ ముహూర్తాన రత్న భండార్ తలుపులు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడే అసలు కథ మొదలైంది. రహస్య గది అయితే తెరుచుకుంది. మరి అందులో ఏముంది? నిజంగానే ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు ఉంటే వాటిని లెక్కించడం ఎలా? పర్యవేక్షణ కమిటీ ఏం చెబుతోంది.

అనంత పద్మనాభ స్వామి సంపద అంతు చిక్కడం లేదు. అక్కడ ఆరో నేలమాళిగ తెరుచుకోలేదు. పూరీ జగన్నాథుడి రత్న భండార్ మాత్రం ఎట్టకేలకు తెరుచుకుంది. పూరీలో ఉన్న నిధి చుట్టూ నాగబంధం ఉన్న చర్చకు తెరపడింది. అపార సంపద చుట్టూ నాగబంధం ఉందన్న ప్రచారం కథగానే మిగిలిపోయింది. వజ్ర, వైడూర్యాలను నాగబంధమే కాపాడుతుందన్న చర్చకు కూడా ఎండ్ కార్డ్ పడింది. అలాంటప్పుడు ఇప్పుడు రత్న భండార్ లో ఉన్న ఆభరణాలు ఎన్ని? వాటి విలువ ఎంత? మిస్టరీగా ఉన్న మూడో గదిని తెరిచారంటే ఇప్పుడు ఏం జరగబోతోంది?

వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, కళ్లు చెదిరే ఖజానా, వెలకట్టలేనంత విలువైన సంపద. ఇలా.. పూరీ రత్న భాండాగారంపై ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన గదిగా చెప్పబడుతూ వచ్చింది. ఇప్పుడది తెరుచుకోవడంతో ఇంతకూ ఏయే ఆభరణాలు ఉన్నాయి? నిజంగానే చూస్తేనే కళ్లు బైర్లు కమ్మే, జిల్ జిగేల్ మనే నగలు కనిపించాయా? ఆ సంపదను లెక్కించడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇలా ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి.

Also Read : రత్న భండార్ మూడో గదిలో ఏముంది? ఎందుకు వెళ్లలేకపోయారు? అసలేం జరిగింది..

ట్రెండింగ్ వార్తలు