Balineni Srinivas : అన్ని విషయాలను త్వరలో బయట పెడతా.. బాలినేని సంచలన వ్యాఖ్యలు

కొవ్వు దించుతా అంటున్నావు, ముందు నీకు ఎంత ఉందో చూసుకో. నాకు కొలెస్ట్రాల్ లేదు. నీకు ఉంటే చెప్పు దించుతా అంటూ ..

Balineni Srinivas Reddy

Balineni Srinivasa Reddy : వ్యవస్థలను మోసం చేసిన చరిత్ర ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దేనని మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం బాలినేని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దామచర్ల జనార్దన్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకరేమో చొక్కాలు విప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఒక మాజీమంత్రిని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తినే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Pawan Kalyan – RK Sagar : పవన్ కళ్యాణ్ ని కలిసిన మొగలిరేకులు RK సాగర్.. తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం..

కొవ్వు దించుతా అంటున్నావు, ముందు నీకు ఎంత ఉందో చూసుకో. నాకు కొలెస్ట్రాల్ లేదు. నీకు ఉంటే చెప్పు దించుతా అంటూ టీడీపీ ఎమ్మెల్యేపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో మాట్లాడొద్దని హెచ్చరించారు. గత ఎన్నికల అనంతరం రెండేళ్లకు వచ్చావు. నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేనే చెబుతా. అక్రమాలు నిగ్గు తేల్చాలని నేనే అడిగితే మళ్ళీ మీరేం మాట్లాడుతారు. నేను భూకబ్జాలు చేసి ఉంటే తేల్చాలని చెప్పాను. ఆ పనిచేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దుర్మార్గంగా, కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మా అన్న సైట్ కొనుక్కున్నా బురద చల్లాలని చూశారు. పట్టాలు ఇస్తే దొంగ పట్టాలు అన్నారు… ఇప్పుడు తేల్చు. స్థలాల కొనుగోలు విషయంలో రైతుల దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నాను అని రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని బాలినేని అన్నారు.

Also Read : శివ సేఫ్.. త్వరలోనే కువైట్ నుంచి రాష్ట్రానికి తీసుకొస్తాం- మంత్రి నారా లోకేశ్

మా కోడలు మీద అక్రమ కేసులు పెట్టాలి అంటారు. నా కొడుకుతో తిరిగే వాళ్ళను గంజాయి బ్యాచ్ అంటారు. నేనైతే ప్రశ్నించే వాడ్ని.. ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటా. జగన్ కరెక్ట్ గా చేయక పోయినా ప్రశ్నించా. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడ్డా. సాప్ట్ గా ఉండే నన్ను కొంతమంది ఇరిటేట్ చేస్తున్నారు. తప్పుగా మాట్లాడితే వెంటనే క్షమించమని అడిగా. 1973 లోనే మాకు సొంత కారు ఉంది.. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. 1973 సమయానికి మీ కుటుంబ పరిస్థితి ఏంటి అంటూ టీడీపీ ఎమ్మెల్యేను బాలినేని ప్రశ్నించారు. అధికార మదంతో మమ్మల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా సొంత పార్టీలో కూడా నేను ఇబ్బందులు పడ్డా. కొంతమంది బయటి వ్యక్తులతో కలసి మా వాళ్ళే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా. వైఎస్ఆర్ మీద ఉన్న ప్రేమతో అన్నీ ఓర్చుకుని పార్టీలో కొనసాగుతున్నాను. నేను హవాలా చేసినా, భూకబ్జాలు చేస్తే దేనికైనా సిద్ధం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. అన్ని ఆరోపణలపై విచారణ జరపాలని బాలినేని అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు