ఇది కదా సక్సెస్ అంటే.. ఆనందంతో అమ్మ కళ్లలో కన్నీళ్లు.. వీడియో వైరల్
ఈ హార్ట్ టచింగ్ వీడియోను మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 15, 2024 / 01:58 PM IST
Heart touching video goes viral mother cries tears of joy after son cracks CA exam
Heart touching video: పిల్లలు సక్సెస్ సాధిస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది పేరెంట్సే. పిల్లల విజయాలను తమ సక్సెస్‌గా పొంగిపోతుంటారు తల్లిదండ్రులు. కష్టాలను ఎదుర్కొని సాధించే సక్సెస్ అంతులేని ఆనందాన్నిస్తుంది. అలాంటి సాధించిన విజయాన్ని తన కొడుకును చూసి ఓ తల్లి తెగ సంతోషపడిపోయింది. అమితానందంతో కుమారుడిని హత్తుకుని ఆనంద బాష్సాలు కార్చింది. అమ్మ స్పందన చూసి ఏం చేయాలో తెలియక కొడుకు అలాగే ఉండిపోయాడు. ఈ అపురూప దృశ్యంతో కూడిన వీడియో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియోలో ఏముందంటే..
ఓ పెద్దావిడ రోడ్డుపక్కన దుకాణం పెట్టుకుని కూరగాయాలు అమ్ముతుంటుంది. అంతలో తన కొడుకు వచ్చి ఏదో చెప్పగానే దుకాణంలో కూర్చున్న మహిళ లేచివచ్చి అతడిని గుండెలకు హత్తుకుంటుంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక కొడుకు అలాగే ఉండిపోతాడు. కాగా, ఈ వీడియోలో ఉన్న యువకుడు యోగేశ్ అని, సీఏ పూర్తిచేశానని తల్లికి చెప్పడంతో ఆమె ఈ విధంగా స్పందించారని చవాన్ వెల్లడించారు. యోగేశ్ తల్లి తొంబరే మావాషి.. ధానే సబర్బన్‌లో డోంబివిలి ఈస్ట్ ప్రాంతంలోని గాంధీనగర్‌లో కూరగాయాల దుకాణం నడుపుతున్నారని తెలిపారు.
”దృఢ సంకల్పం, పట్టు వదలని కృషితో యోగేశ్ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని అద్భుతమైన విజయాన్ని సాధించారు. కొడుకు విజయాన్ని చూసి అతడి తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఏ లాంటి కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన యోగేశ్‌ని అభినందించకుండా ఉండలేం. డోంబివిలి ప్రాంత వాసిగా యోగేశ్ విజయానికి సంతోషిస్తున్నాన”ని మంత్రి రవీంద్ర చవాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Also Read : అనంత్ అంబానీ పెళ్లి వేళ.. వైరల్ అవుతున్న ముకేశ్ అంబానీ పెళ్లి ఫొటో..
ఈ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారడంతో నెటిజనులు యోగేశ్‌పై ప్రశంసలు కురిపించారు. కఠిన పరిస్థితులు ఎదుర్కొని తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారని అభినందించారు. భవిష్యత్తులో అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
योगेश, तुझा अभिमान आहे.
डोंबिवली पूर्व येथील गांधीनगर मधील गिरनार मिठाई दुकानाजवळ भाजी विकणाऱ्या ठोंबरे मावशींचा मुलगा योगेश चार्टर्ड अकाऊंटंट (C.A.) झाला.
निश्चय, मेहनत आणि परिश्रमांच्या बळावर योगेशने खडतर परिस्थितीशी तोंड देत हे दैदीप्यमान यश मिळवलं आहे. त्याच्या या… pic.twitter.com/Mf8nLV4E61
— Ravindra Chavan (@RaviDadaChavan) July 14, 2024
Also Read : అరె బాబూ ఇవే తగ్గించుకోవాలి..! ముంబై లోకల్ ట్రైన్‌లో యువకుడు ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్
