అరె బాబూ ఇవే తగ్గించుకోవాలి..! ముంబై లోకల్ ట్రైన్‌లో యువకుడు ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్

ముంబైలోని సెవ్రీ స్టేషన్ లో కదులుతున్న లోకల్ ట్రైన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ ఎక్కుతున్నట్లుగా ట్రైన్ డోర్ వద్ద కడ్డీని పట్టుకొని ..

అరె బాబూ ఇవే తగ్గించుకోవాలి..! ముంబై లోకల్ ట్రైన్‌లో యువకుడు ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్

Mumbai Local Train

Mumbai Local Train : సెల్ఫీలు, రీల్స్ పేరుతో కొందరు యువతీ, యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై లోకల్ ట్రైన్స్ లో వీరి ఆగడాలకు హద్దులేకుండా పోయితుంది. తాజాగా ఓ యువకుడు ముంబైలో లోకల్ ట్రైన్ కదులుతుండగా దానిని పట్టుకొని ప్లాట్ ఫాంపై పరుగులు తీస్తూ ప్రమాదకర విన్యసాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెంట్రల్ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read : Pawan Kalyan – Chandrababu : అంబానీతో సహా ప్రముఖులందరికి.. దగ్గరుండి పవన్ కళ్యాణ్‌ని పరిచయం చేసిన చంద్రబాబు..

ముంబైలోని సెవ్రీ స్టేషన్ లో కదులుతున్న లోకల్ ట్రైన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ ఎక్కుతున్నట్లుగా ట్రైన్ డోర్ వద్ద కడ్డీని పట్టుకొని ఉన్నాడు. ట్రైన్ ముందుకు కదిలినప్పటికీ ఆ కడ్డీని పట్టుకొని ప్లాట్ ఫాంపై జారూతూ ప్రమాదకర విన్యాసం చేశాడు. కొంచెం పట్టుతప్పినా ప్లాట్ ఫాం నుంచి పట్టాలపై పడే ప్రమాదం ఉంది. అయినా యువకుడు ప్రమాదకర విన్యాసం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై సెంట్రల్ రైల్వే (సీఆర్) స్పందించింది. వీడియోలోని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆర్పీఎఫ్ ను ఆదేశించింది. దీంతో సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు అధికారులు దృష్టిసారించారు.

Also Read : భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చిన ఫోటోషూట్.. ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి.. వీడియో వైరల్

రైల్వే ప్రయాణికుల భద్రత, వారి సురక్షితమైన ప్రయాణంకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రైల్వే పేర్కొంది. యువతీ, యువకులు, ఇతర ప్రయాణికులు ప్రమాదకరమైన విన్యాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరింది. రైల్వే ప్లాట్ ఫాంలపై, రైళ్లలో విన్యాసాలు చేయడం మానుకోవాలని ప్రయాణికులకు సూచించింది. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తమకు సమాచారం అందించాలని సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.