మాజీ ముఖ్యమంత్రి విడాకుల కేసు.. భార్యకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు

దంపతులిద్దరూ గత 15 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నందున వీరి వివాహ బంధం ముగిసిపోయినట్టేనని ఒమర్‌ అబ్దుల్లా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Omar Abdullah Divorce Supreme Court Notice to Payal Abdullah

Omar Abdullah Divorce Plea: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా భార్య పాయల్‌ అబ్దుల్లాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒమర్‌ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పాయల్‌ అబ్దుల్లాను జస్టిస్‌లు సుధాన్షు ధులియా, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

తన భార్యతో విడాకులు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఒమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదించారు. అబ్దుల్లా దంపతులు గత 15 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నందున వీరి వివాహ బంధం ముగిసిపోయినట్టేనని కోర్టుకు తెలిపారు. వివాహాలను రద్దు చేసేందుకు గతంలో ప్రయోగించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఆయన అభ్యర్థించారు.

క్రూరత్వం కారణంగా తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఒమర్‌ అబ్దుల్లా చేసిన అభ్యర్థనను గతేడాది ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 2016లో ఫ్యామిలీ కోర్టును ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు సంజీవ్ సచ్‌దేవా, వికాస్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించింది. పాయల్ అబ్దుల్లాపై మోపిన క్రూరత్వ ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని, ఆధారాలు లేవని పేర్కొంటూ విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్లో ఎలాంటి లోపం లేదని, ఈ నిర్ణయంతో తాము ఏకీభవిస్తున్నట్టు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read : హార్ట్ టచింగ్ వీడియో.. ఇది కదా సక్సెస్ అంటే.. ఆనందంతో అమ్మ కళ్లలో కన్నీళ్లు

ఒమర్, పాయల్ అబ్దుల్లా 1994, సెప్టెంబర్ 1న వివాహం చేసుకున్నారు. మనస్పర్ధలు రావడంతో 2009 నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు. తమ ఇద్దరు కుమారుల సంరక్షణను పంచుకున్నారు. కాగా, పాయల్ అబ్దుల్లాకు మెయింట్‌నెన్స్ కోసం నెలకు రూ.1.5 లక్షలు చెల్లించాలని ఒమర్ అబ్దుల్లాను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆయనఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికీ నెలకు 60వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.

Also Read : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడితో పాటు పలువురు అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు