పూరిలో కన్నుల పండువగా జగన్నాథుడి రథోత్సవ వేడుకలు..ఆలయ క్షేత్రానికి దేవతామూర్తులు

పూరీ జగన్నాథ స్వామి రథోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు.

Puri Jagannath Swamy Chariot Festival

Puri Jagannath Swamy Chariot Festival : పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి స్వామి వారి బాహూదా రథయాత్ర కొనసాగుతుంది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా మంది భక్తులు తరలిరావడంతో పూరీ ప్రాంతం జనసంద్రంగా మారింది. 12రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం.. ప్రతీయేటా ఆషాడ శుద్ధ తదియ రోజున ప్రారంభమవుతుంది.

Also Read : రత్న భండార్ మూడో గదిలో ఏముంది? ఎందుకు వెళ్లలేకపోయారు? అసలేం జరిగింది..

ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ, పూరీ ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మధ్వజం’ అని భక్తులు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుంది.

Also Read : రత్న భండార్ తెరిచే సమయంలో అనూహ్య ఘటన.. సొమ్మసిల్లి పడిపోయిన ఎస్పీ

ఇవాళ బహుదా యాత్ర సందర్భంగా.. రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దశాబ్దాల తరువాత ఆదివారం రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. రత్న భాండాగారం తాళాలు పని చేయకపోవడంతో.. కట్టర్లతో అధికారులు తలుపులు కట్ చేశారు. సమయానుభావం కావడంతో రత్న భాండాగారంలోనికి అధికారులు, హైలెవల్ కమిటీ వెళ్లలేదు. రత్నభాండాగారానికి మరొక తాళం అమర్చి జిల్లా ఖజానా కార్యాలయంలో అధికారులు భద్రపర్చారు. రథోత్సవాలు పూర్తి అయిన తరువాత మరోసారి కమిటి సమావేశమై రత్న భాండాగారంలో సంపద లెక్క కట్టడంపై మరో మూర్గాన్ని హైలెవిల్ కమిటీ, పూరీ జగన్నాథ్ ట్రస్ట్ నిర్ణయించనుంది.

 

ట్రెండింగ్ వార్తలు